#SocialMedia - తప్పుగా వాడకండి.!
భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులకు, జీడిమెట్ల ఇంస్పెక్టర్ మల్లేశం ప్రేరణాత్మక సందేశం
అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఈ సేవాతత్పరతను అభినందించేందుకు జీడిమెట్ల సర్కిల్ ఇంస్పెక్టర్ మల్లేష్ కాలేజీని సందర్శించారు.
సిఐ విద్యార్థులను అభినందిస్తూ, రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రక్తదానం ద్వారా ఎన్ని ప్రాణాలు రక్షించబడతాయో, ప్రతి యువకుడు సంవత్సరానికి కనీసం ఒకసారి రక్తదానం చేయడం ద్వారా సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాడని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అలాగే ఆయన మాట్లాడుతూ., సోషల్ మీడియా ప్రభావం వల్ల యూత్ తప్పుదారిలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను అనుభవించిన కొన్ని క్రిమినల్ కేసుల ఉదాహరణలను ప్రస్తావిస్తూ, చిన్న తప్పులు జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు : JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ | RSS శతాబ్ది ఉత్సవాలు | Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు | గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా | విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది | మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం | దగ్గు సిరప్ ఆరోగ్యానికి హానికరం
యువతలో ఆలోచన విధానం మారాలి, జీవితంలో స్పష్టమైన క్యారియర్ గోల్ పెట్టుకుని ఎదగాలని, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రవర్తించాలని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగ్యరధి డిగ్రీ కాలేజీ డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్, ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది, అలాగే పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, స్ఫూర్తి, సానుకూల ఆలోచనలకు నాంది పలికిందని కాలేజీ యాజమాన్యం స్పష్టంచేసింది.
Publisher
Namasthe Bharat