TELANGANA : చదువుకుంటాం.. కరుణచూపండి..
అధికారుల నిర్లక్ష్యం కారణంగా చదువుకు దూరం అవుతున్నమని బడి పిల్లల ఆందోళన
బుడిబుడి అడుగులు వేస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు, కలెక్టర్ గారు మాబ్రతుకులు మార్చండి అంటూ పాదయాత్ర చేశారు. బలపం పట్టి చిట్టి చేతులతో ఓనమాలు నేర్చుకోవాల్సి వారు ఉపాద్యాయుడు కావాలి అనే ప్లకాడ్లతో ప్రదర్శన చేశారు. అ.ఆ..లు పల్కల్సిన పిల్లలు బాణాలు ఇస్తారా, చదువులుయిస్తారా అని ప్రశ్నించారు.
భావిభారత పౌరులు తయారు చెయ్యాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ బడులను విస్మరిస్తున్నాయి. దింతో తమ సమస్యను తామే తిర్చుకుంటామని పల్కలను ప్లకాడుల్లా మల్చుకొని ఆందోళన చేశారు పసిపిల్లలు.
వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, మెట్లగూడెం ప్రైమరీ సర్కారు బడి గత ప్రభుత్వం హయం మూతపడింది. మూతబడిన విద్యాలయాలు మల్లి తిరిగి ప్రారంభించడంతో ఈవిద్య సంత్సరంలో దాదాపు 20 మంది పిల్లలు పాఠశాల్లో చేరారు. కానీ ఈపాఠశాలకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఎవ్వరు లేరు, స్కూల్ యునిఫామ్ అందించలేదు, మధ్యాహ్న భోజనం పెట్టేవారు లేకపోవడంతో విద్యార్థి సంఘాల నాయకుల జోక్యంతో బడి పిల్లలు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అధికారులకు, ప్రభుత్వనికి వెతిరేక నినాదాలతో ఉన్న ప్లకాడ్ లను ప్రదర్శశిస్తూ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ., మాకు ఒక టీచర్ కావాలి, చదువులేక మేము బాధపడుతున్నాము, మాకు చదువుకోవాలని ఆశగలిగింది, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను తీర్చాలని కోరుతూ టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. తదనంతరం విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా అధికారులకు వినీతి పత్రం అందించారు.
Publisher
Namasthe Bharat