SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు

హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చెయ్యాలి

On
SHADNAGAR | సిపిఆర్ అవగాహన సదస్సు

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డిప్యూటీ DMHO కార్యాలయంలో  వైద్య ఆరోగ్య సిబ్బందికి డాక్టర్ వి.విజయలక్ష్మి, డాక్టర్ అమృత జోసఫ్ సిపిఆర్ పైన అవగాహన కల్పించారు. CPR అనగా కార్డియో పల్మరీ రిసర్కిటేషన్ అని డాక్టర్ విజయలక్ష్మి తెలియజేశారు. ఈ ప్రాసెస్ మూడు స్టెప్ ల ద్వారా చెయ్యాలని తెలియజేసారు.

IMG-20251017-WA0021

స్టెప్ 1: అన్ కాన్సియస్ లో పడి ఉన్న పేసెంటును ముందుగా చదునైన ప్రాంతంలో వెలికిలా పడుకోబెట్టాలి. అతనిలో ఎలాంటి కదలిక లేకపోతే,వెంటనే పల్స్ చూడాలి అని, వాస్తవానికి మేజర్ హార్ట్ ఎటాక్ అయితే పల్స్ దొరకదు, కాబట్టి మెడ వద్ద పల్స్ చూడాలి, ఒకవేళ అక్కడ కూడా పల్స్ దొరకలేదంటే హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించాలి.

స్టెప్ 2:  హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ చేయాలి. మీ చేతిలో పేషెంట్ చాతి (గుండె మీద కాదు) మధ్య భాగంలో ప్రెస్ చేయాలి అని, ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్ కాకుండా స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి అని,  చాతిని కనీసం ఐదు సెంటీమీటర్ లోతుకు వెళ్లేలా నొక్కాలి అని,  నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలని చెప్పారు.

స్టెప్ 3:  ఇలా ఒక్క నిమిషం చేశాక పల్స్ చెక్ చేయాలి పల్స్ దొరకకపోతే పేషెంట్ ముక్కు మూసి అతని నోటిలోకి మీ నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అని, తర్వాత మళ్లీ సిపిఆర్ చేయాలని , ఇలా 20 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి అని , ఇలా చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుందని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.వాస్తవానికి హార్ట్ ఎటాక్ వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ సి పి ఆర్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది , మరి ఆలస్యం చేస్తే లాభం ఉండకపోవచ్చు , ఒకరు పేషెంట్ కు సి పి ఆర్ చేస్తుంటే , చుట్టూ ఉండేవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 108 గాని లేదా ఆ అంబులెన్స్ కి గాని ఫోన్ చేయాలి వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని తెలియజేశారు.

IMG-20251017-WA0023

నోట్ : జె .శ్రీనివాస్ హెల్త్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ నేటి కాలం ప్రతి ఒక్కరూ కచ్చితంగా సి .పి. ఆర్ ప్రాసెస్ నేర్చుకోవాలని , దీనివల్ల ఆపత్కాలములో మరొకరి పరాలను కాపాడవచ్చు అని తెలియచేశారు. మీరు నేర్చుకున్న సి.పి.ఆర్ ప్రాసెస్ మీ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలియజేయాలని జె .శ్రీనివాసులు చెప్పారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, ఎం.ఎల్ .హెచ్. పి . వైద్య అధికారులు, హెల్త్ సూపర్వైజర్లు  డివిజన్లోని ఏ.ఎన్.ఎం.లు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

Share On Social Media

Related Posts

Latest News

#Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే #Vaagdevi: అంగరంగ వైభవంగా వాగ్దేవి హై స్కూల్ అన్యువల్ డే
వాగ్దేవి హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా పెద్దకడుబూరు
ఏసీబీ వలలో నందిగామ ముగ్గురు ప్రభుత్వ అధికారులు
#MIYAPUR: బ్లాక్ మెయిలర్ పై చర్యలు తీస్కోండి..!!
విధులకు హాజరు కాని వార్డెన్ సస్పెండ్ చేయాలి SFI
జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం
హలో కామ్రేడ్ చలో ఖమ్మం 

Advertise