భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
అనంతరం ఆత్మహత్య చేసుకున్న కన్న తల్లి - బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఇద్దరు కవల పిల్లల ప్రాణాలు తీసినంతరం, తల్లి సైతం ఆత్మహత్మ చేసుకున్న ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేటులోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పద్మనగర్ ఫేజ్ - 1లో ఓఇంట్లో నివాసముంటున్న సాయి లక్ష్మి (27)కు రెండేళ్ల వయసున్న ఇద్దరు కవల పిల్లల ఉన్నారు. అయితే మంగళవారం సూర్యోదయ సమయం 4 గంటలకు సాయి లక్ష్మి మూడోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు, వారి ఇంట్లోకి వెళ్లి చూసారు అక్కడ విగత జీవులుగా ఇద్దరు చిన్నారులు ఒక బాబు, పాపా పడి ఉన్నారు. వీరిని తల్లే గొంతు నులిమి హతమార్చి, అనతరం ఆత్మహత్యకు పాలుపడి ఉండచ్చని అనుమానిస్తున్నారు అక్కడి వారు.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంభ కలహాలే, ఈ విషాదానికి కారణం కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Publisher
Namasthe Bharat