Teenmarr Mallanna : రేపటి తెలంగాణ బందుకు TRP మద్దతు
రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న వారి దిష్టిబొమ్మను దహనం చెయ్యాలని మల్లన్న ఆదేశం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిన్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రంలో తలపెట్టబోయే బందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలిపింది. అంతేకాకుండా బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న కుట్రదారుల దిష్టిబొమ్మలను తగలబెట్టాలని TRP చీఫ్ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.
బీసీ వాదాన్ని, భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చగా మార్చడం కొరకు అందరూ ఈ బంద్ లో పాల్గొనాలని మల్లన్న విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వం కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని ఒక్క వాహనం కూడా రోడ్డు మీద తిరగడానికి వీల్లేదని మల్లన్న స్పష్టంచేశారు.
పోలీసులు ఎవరు కూడా ఈ బంద్ ను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని, అలా కాదని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లను ముట్టడించే కార్యక్రమం చేస్తాం అని హెచ్చరించారు.
రేపటి బంద్ బీసీల ఆకాంక్షగా మనం చూడాలని, ఈ బందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలను ఆదేశించింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ.
Publisher
Namasthe Bharat