JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
412 మంది దాతలతో మహారక్తదానం విజయవంతం
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జీడిమెట్ల పోలీసులు ఇచ్చిన రక్తదాన పిలుపుకు వందలాది మంది తరలొచ్చారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరంలో జీడిమెట్ల పరిశ్రమల్లోని పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు, కార్మికులు, రాజకీయ నేతలు, సామాన్య యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.
రక్తదాతలకు హెల్మెట్‌ల బహూకరణ
రక్తదాతలకు ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ హెల్మట్‌లను బహుకరించారు. రక్తదానం చేసిన మూడు వందల మందికి ఉచితంగా హెల్మెట్‌ను అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు కోసం దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, అలాంటి వారి కోసం రక్షణగా నిలిచేందుకు హెల్మెట్ అందించినట్లు చెప్పారు. ఈక్విటాస్, రామరాజు ఆసుపత్రి, వాక్సేసాన్ పాఠశాలల సహకారంతో హెల్మెట్‌లను అందించారు.
ముఖ్య అతిథిగా ఏసీపీ నరేశ్ రెడ్డి
సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహాంతి, బాలానగర్ జోన్ డీసీపీ సేరేశ్‌కుమార్ ల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ మహారక్తదాన కార్యక్రమానికి బాలానగర్ ఏసీపీ నరేశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదాతలను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
మూడేళ్ల చిన్నారి ప్రాణాలు నిలిచాయి
ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేశ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మహారక్తదాన శిబిరం మూడేళ్ల చిన్నారి ప్రాణాల్ని కాపాడేలా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుచిత్రలోని రష్య్ ఆసుపత్రిలో మూడేళ్ల చిన్నారికి శస్త్ర చికిత్స జరుతున్న సందర్భంగా ఆచిన్నారికి ఏ నెగెటీవ్ బ్లడ్ అవసరం కలిగింది. దింతో జీడిమెట్ల రక్షక భట నిలయంలో రక్తదాన ఉందని తెలియడంతో ఆ చిన్నారి తల్లిందడ్రులు వచ్చారు. వెంటనే వారికి ఇద్దరి దాతలను వెంటనే పంపించిరు. నిర్వహించిన ఈ రక్తదానం కార్యక్రమంలో 412 మంది దాతలు పాల్గొన్నారని స్పష్టంచేశారు.
దాతల వద్ద నుండి సేకరించిన రక్తాన్ని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు, తలసేమియా, సికిల్ సెల్ సొసైటీకి అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో నిమ్స్ బ్లడ్ బ్యాంకు డాక్టర్ కార్య దీక్ష, టెక్నికల్ ఆఫీసర్ బిడుగు శేఖర్, డీఐ ధనుంజయ, ఎస్సైలు నాయుడు, సత్యనారాయణ, శ్యామ్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat