HYDRAA : హైడ్రాకు కంప్లైంట్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమాలను కూల్చివేయ్యాలని ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు
అక్రమ నిర్మాణాలను తొలగించాలని, ప్రగతి నగర్ వైకుంఠదామని అభివృద్ధి చెయ్యాలని సీపీఐ అధ్యర్యంలో బుద్ధ భవనులో హైడ్రా ప్రజావాణిలో అడిషనల్ కమిషనరుకు వినతిపత్రం అందించారు.
అనంతరం బాచుపల్లి మండల సీపీఐ కార్యదర్శి పాలాభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ., బాచుపల్లి మండలంలో కబ్జాదారులు వెయ్యిల కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలలను ఇష్టరాజ్యాంగ కబ్జాచేస్తుంటే రెవిన్యూ, మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సంతోష్ నాయక్ అనే వ్యక్తి నిజాంపేట్ సర్వే నెంబర్ 191లో 59జిఓ క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా దాదాపు 200 గజాల కబ్జా చేసి స్థలంలో పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్నాడని, ఎన్ని సార్లు రెవిన్యూ, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన చీమ కూటినట్లు కూడా లేదని, పైగా రెవిన్యూ ఇంస్పెక్టర్ భాను జిల్లా కలెక్టరుకు ఇచ్చిన రిపోర్టులో సంతోష్ నాయక్ బిల్డింగ్ పూర్తిగా తొలగిచ్చినట్లుగా ఉందని మండిపడ్డారు. బచూపల్లిలో అధికారుల పనితీరు ఎలా ఉందొ సంతోష్ నాయక్ కబ్జాపై ఇచ్చిన రిపోర్ట్ చూస్తే అర్థం అవుతుందని అన్నారు. ప్రస్తుతం బిల్డింగ్ అట్లేనే ఉన్న చర్యలు తీసుకోలేదని అన్నారు. అంటే కలెక్టర్ ఫీల్డ్ కు రాడు మనం ఎలా రిపోర్ట్ రాస్తే అదే ఫైనల్ అనే భ్రమలో కొంతమంది అధికారులు వున్నారు. కానీ గతంలో ఎర్ర కుంటలో మాజీ కమిషనర్ ఏమయ్యాడో, గతంలో నిజాంపేట్ రెవిన్యూ ఇంస్పెక్టర్ శ్రీదేవి పరిస్థితిని గుర్తు పెట్టుకోవలని గుర్తుచేశారు.
అలాగే నిజాంపేట్ ఇందిరమ్మ ఇల్లు ఫేస్ -3 బ్లాక్ -21,22 వెనక జరుగుతున్న ప్రభుత్వ స్థలం ఆక్రమించి చేస్తున్న అక్రమ నిర్మాణం దసరా పండుగ ముందు ఆగింది. పండగ సందర్బంగా ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది పేర్కొన్నారు. అక్రమ షెడ్లు ఎక్కడ పడితే అక్కడ నిర్మాణం జరుగుతున్నాయి, ప్రగతి నగర్ జగన్ స్టూడియో దగ్గర కూడా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ బొజ్జ సరితకి స్పదించడం లేరని ఫైర్ అయ్యారు. ఒక వైపు వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంటే సాధారణ ప్రజలు మరణించిన తరువాత వారి అంతక్రియలు చెయ్యడానికి గత కొంత కాలంగా ఉపయోగిస్తున్న ప్రాంతాని సైతం కబ్జా చేస్తే స్థానిక నాయకులు తప్ప, అధికారులు, ప్రతిపక్ష నాయకులు ఆసమస్యను పరిస్కారం చేయకపోవడం అంటే ఓటు రాజకీయలు తప్ప ప్రజాసమస్యలతో సంబంధం లేదు, అని అర్థం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నికంటి దాస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat