Category
Telangana
Telangana 

భజరంగ్ జయంతి.. శోభాయమానంగా మరీనా కైసర్ నగర్.!

భజరంగ్ జయంతి.. శోభాయమానంగా మరీనా కైసర్ నగర్.! భక్తి పారవశ్యంతో వెలిగిన కైసర్ నగర్ ప్రాంతం అంజన్నకు ప్రత్యేక పూజలు చేసిన మద్దెల సాయి బాబా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించిన దేవాలయ కమిటీ సభ్యులు   కుత్బుల్లాపూర్ : జై హనుమాన్ జై భజరంగ్ నినాదాలతో గాజులరామరం గ్రామంలోని కైసర్ నగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం మారుమోగింది. హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా శనివారం ఉదయం నుండే ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పండితులు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించి, రాకరకాల పండ్లు, పూలతో అలంకరించారు. ఆంజనేయ స్వామికి దేవాలయ ఛైర్మెన్ మద్దెల సాయిబాబా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంజన్నను స్థానికులు దర్శించుకున్నారు. స్థానిక 125 డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి రావు ముఖ్యాతిధిగా పాల్గొని హనుమంతుడి ఆశీర్వాదం తీస్కున్నారు. దర్శనానికి వచ్చిన బస్తి పెద్దలకు, నాయకులకు, అతిధులకు కాషాయ కండువా కప్పి సత్కరించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాదన్నీ  దాదాపు 2000 మంది  స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకుడు సాయి బాబా మాట్లాడుతూ., స్వచ్ఛమైన హృదయంతో ప్రతిరోజూ అంజన్నను పూజిస్తే జీవితం సకల మంగళం అవుతుందని అన్నారు. జై హనుమాన్ ఈ ఒక్క మాట అన్ని భయాలను తొలగిస్తుందని అందుకే ప్రతిఒక్కరు హనుమాన్ చాలీసా చదవాలని సూచించారు. ఆంజనేస్వామిని పూజించండతో జీవితంలో బాధలు, కష్టలు తొలగి సంతోషంగా జీవిస్తారని తెలిపారు. కలియుగంలో కష్టాలు తీర్చే దేవుడు భజరంగ్ భళని కొనియాడారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుడిని కోరామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కమలాకర్, కస్తూరి బాలరాజు, పర్స శ్రీనివాస్ యాదవ్, అజయ్ గుప్తా, చిన్న బాబు, శివ కుమార్, నరేష్, భాస్కర్, చంద్ర, రాజు యాదవ్, శ్రీశైలం, సురేష్, బాలకృష్ణ, వెంకటేశం, భాస్కర్ రావు, వెంకటేష్, జిత్తు, చంద్ పాషా, బాలకృష్ణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.  
Read More...
Telangana  Devotion 

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర.. ప్రారంభమైన సలేశ్వరం జాతర

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర.. ప్రారంభమైన సలేశ్వరం జాతర అచ్చంపేట: నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యంతం ఆహ్లాదకరం.. ఎత్తయిన కొండలు.. లోయలు.. పక్షుల కిలకిలరావాలు.. దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి. చెంచులే పూజారులుగా జరిపే నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల అడవుల్లోని సలేశ్వరం ఉత్సవాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. దారిపొడవునా అటవీ అందాలు, ప్రముఖ శైవ క్షేత్రాలు, కనువిందు చేసే...
Read More...
Telangana 

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌డ‌గ‌ళ్ల వాన‌లు..!

తెలంగాణ‌లో మూడు రోజుల పాటు వ‌డ‌గ‌ళ్ల వాన‌లు..! హైద‌రాబాద్ : తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే అవ‌కాశం ఉంది. మ‌రికొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. వ‌డ‌గ‌ళ్ల వాన కురిసే స‌మ‌యంలో గంట‌కు 30...
Read More...
Telangana 

రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు?

రేవంత్ రెడ్డి వస్తున్నాడని పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దు? హైదరాబాద్‌: దక్షిణాది అయోధ్య భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రుల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. రామయ్య సీతమ్మను కల్యాణమాడే అద్భుతఘట్టాన్ని కన్నులారా వీక్షించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కూడా అనుకున్నారు. ఆదివారం నాటి కల్యాణ వేడుకకు స్వయంగా హాజరుకావాలనుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ భద్రాద్రి పర్యటనకు వస్తున్నట్లు ఆలయ అధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం ఉన్నతాధికారులకు...
Read More...
Telangana  హైదరాబాద్ 

హైద‌రాబాద్‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య‌

హైద‌రాబాద్‌లో ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌య‌ల‌క్ష్మి ఆత్మ‌హ‌త్య‌ హైద‌రాబాద్ : కవాడిగూడలోని సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఓ అధికారిని ఆత్మహత్య చేసుకున్నారు. గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీజీవో టవర్స్‌లో ఉద‌యం 11:15 సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సీజీవో టవర్స్‌ సిబ్బంది గాంధీనగర్‌ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీంతో కలిసి...
Read More...
Telangana 

ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్.. కేశంపేట పీఎస్‌కు త‌ర‌లింపు

ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు అరెస్ట్.. కేశంపేట పీఎస్‌కు త‌ర‌లింపు కేశంపేట, ఏప్రిల్ 2 : ఎల్‌హెచ్‌పీఎస్(లంబాడి హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్ నాయక్‌ను కేశంపేట పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మండల పరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ సమీపంలోగల ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు అరెస్టు చేసి కేశంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర కేబినెట్‌లో లంబాడీ ఎమ్మెల్యేల‌కు స్థానం కల్పించాలని డిమాండ్...
Read More...
Telangana 

తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ హైదరాబాద్‌

తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ హైదరాబాద్‌ తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు పలుచోట్ల పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపటి నుంచి వచ్చే నాలుగు రోజులు క్రమంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు తగ్గే అవకాశం...
Read More...
Telangana 

ఉగాది పచ్చడి తయారు చేద్దామిలా..

ఉగాది పచ్చడి తయారు చేద్దామిలా.. కొల్లాపూర్, మార్చి 30: ఉగాది పండుగ తెలుగు ప్రజలకు ఎంతో విశిష్టమైనది. అయితే ఇది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు. యుగ ఆరంభానికి నాంది అని చెప్పొచ్చు. కాల గమనంలో భాగంగా వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు తెలుగు నూతన శకం ప్రారంభమవుతుంది. ఈరోజు వేద పండితులు గ్రహ నక్షత్రల స్థితిని బట్టి...
Read More...
Telangana 

టీజీపీఎస్సీ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుద‌ల‌..

టీజీపీఎస్సీ గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుద‌ల‌.. ఉగాది పండుగ సంద‌ర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గత సంవత్సరం అక్టోబర్‌లో గ్రూప్-1 పరీక్షలను నిర్వహించిన టీజీపీఎస్సీ, ఈ సంవత్సరం మార్చి 10న తాత్కాలిక మార్కులను వెల్లడించింది. ఇప్పుడు తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల...
Read More...
Telangana 

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు నాగర్‌కర్నూల్, మార్చి 29: నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమల పెంట ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు 36వ రోజుకు చేరుకున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు నిర్విరామంగా కృషిచేస్తున్నాయి. ప్రమాదం జరిగి 36 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఇద్దరు ఇంజనీర్ల మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగిలిన ఆరుగురి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోజు...
Read More...
Telangana 

టమాట డమాల్‌.. రైతులకు దక్కేది కిలోకి 2 నుంచి 6 మాత్రమే

టమాట డమాల్‌.. రైతులకు దక్కేది కిలోకి 2 నుంచి 6 మాత్రమే చేవెళ్లటౌన్‌, మార్చి 28: టమాట పంట రైతుల కంట కన్నీరు  తెప్పిస్తోంది. దిగుబడి పెరిగి కష్ణాలు తీరుతాయని ఆశించిన రైతులు మార్కెట్లో ధరలు చూసి ఆవేదన చెందుతున్నారు. దాదాపు ఏడెనిమిది నెలల నుంచి టమాట ధర పతనమై రైతుల జీవితాల్లో తీవ్ర అందోళనను కలిగిస్తున్నది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు....
Read More...