Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
రేవంత్ సర్కారు పై నిప్పులు చెరిగిన మల్కాజిగిరి ఎంపీ రాజేంద్ర
42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జెఎసి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని తెలుసుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద “తెలంగాణ బీసీ బంద్” లో పాల్గొని మద్దతు తెలిపారు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసింది. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయి. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి ఆరిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్లో చేర్చారు.
తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వేచేశారు. బీసీ కమీషన్ వేశారు. ఎన్ని వేసిన నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదు. ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు.. లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారు.
నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంట. నేను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. బీసీలు మేమెంతో మాకంత కావాలి. యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుంది. కుటుంబమే ఏలుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారు.
ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవి. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్ట్లలో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తా అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ మాటలను గుర్తుచేశారు.
మోదీ క్యాబినెట్ లో 27 మంది OBC మంత్రులు ఉన్నారు. BJP నిజాయితీని ఎవరు శంకించలేరు. మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి అమలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెయ్యాలి. ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జెఎసి. అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారి. 42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే వరకు ఆగదు. మాది యాచన కాదు, పాలించే శక్తి మాకు ఉంది. మేమెంతో మాకంత కావలసిందే అని గర్జించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యం అయిందో, బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుందని జోస్యం చెప్పారు.
ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దాం
దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి కామారెడ్డి ఎలక్షన్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లు వెంటనే అమలు చేయాలని తెలంగాణ బందుకు బీసీలు పిలుపు ఇచ్చిన సందర్బంగా బీసీలకు మద్దతుగా తెలంగాణ బీజేపీ పూర్తి మద్ధతు ప్రకటించడం జరిగిందన్నరు, ఇందులో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో జూబ్లీ బస్ స్టేషన్ ముందు ధర్నాలో పాల్గొన్న బీజేపీ దుండిగల్ మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ తదితరులున్నారు.
బందులకు బీజేపీ ఎప్పుడు వెతిరేకం బందులు చేయడం వలన జన జీవనం అవస్థలు పడాల్సి వస్తుంది ఆర్థిక సమస్యలు రావడం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ నిమ్మకు నీరెత్తని ప్రభుత్వo దిగిరావాలి అంటే పోరాడితేనే తప్ప ప్రభుత్వం కదలదు ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా ఒక్క రోజు నిరసన జరిగితే పరవాలేదు దానిద్వారా ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని ఆశ భావం వ్యక్తం చేశారు.
విద్యా సంస్థలు, ఆర్టీసీ, కంపెనీలు ఇతర సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించి మద్ధతు తెలపడం సంతోషం
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ సర్కార్ విభజన రాజకీయాలకు తెరలేపడం దుష్పరిణామం బీసీలకు 42శాతం హామీకి బీజేపీ పూర్తి మద్ధతు ఇచ్చింది కాని అందులో 10 శాతం ముస్లింలను చేర్చడం వెతిరేకిస్తోంది ముస్లింలకు లబ్ది చేకూర్చాడానికి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిన్న మొన్న MIM పార్టీ వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనించగలరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రులలో 42 శాతం కేటాయించి నిరూపించుకోవచ్చు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం ను ప్రకటించి ఎలక్షన్ లోకి వెళ్లడం జరిగింది అలాగే కేంద్ర మంత్రి వర్గంలో 27 శాతం బీసీలకు మంత్రి పదవులు కేటాయించి చిత్తశుద్ధి చాటుకున్నారని స్పష్టంచేశారు బీజేపీ నాయకులు.
Publisher
Namasthe Bharat