విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ
బీజేపీని బలోపేతం చేయటంలో సింధియా పాత్ర కీలకం
విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక నివాళులు అర్పించారు. సమాజ సేవకు రాజమాత సింథియా చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ సాంస్కృతిక మూలలపై విజయరాజే సింథియాకు అపారమైన ప్రేమ ఉండేదని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె చేసిన నిరంతర కృషి దేశ సంప్రదాయాలు, విలువల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. సమాజ సేవకు ఆమె చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. జనసంఘ్ నీ, బీజేపీని బలోపేతం చేయటంలో ఆమె పాత్ర కీలకమైనది. మన సాంస్కృతిక మూలాలపై సింధియాకు అపారమైన ప్రేమ ఉంది. వాటిని పరిరక్షించటానికి, ప్రాచుర్యం కల్పించటానికి ఆమె నిరంతరం కృషి చేశారు”
Publisher
Namasthe Bharat