బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల స్వీకారణ కార్యక్రమం ముఖ్యఅతిధిగా పాల్గొన్న సిడబ్ల్యూసి చల్లా వంశీచంద్ రెడ్డి

On
బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ

కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ విభాగంగా పనిచేస్తుందని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసిసి ఇన్చార్జి  చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. బిజెపి ఓటు చోరీ కి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 కోట్ల మంది సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీ చ్చా నాయక్  అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి వంశీచంద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

IMG-20251012-WA0036

టీపీసీసీ సభ్యుడు అయిల్ల శ్రీనివాస్ గౌడ్, డిసిసి అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 15 వరకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తిచేసి అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. బిజెపి ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని ఓటు చోరీ ద్వారా అధి పత్య  రాజకీయాలు సాగిస్తుందని అన్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా చేపడుతున్నట్లు చెప్పారు. ఈనెల చివరి వరకు డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. యువత, బడుగు బలహీన వర్గాలు,ఎస్సీ ఎస్టీ,మైనార్టీలు, మహిళలకు డిసిసి అధ్యక్షుల నియామకంలో   సమచితస్థానం కల్పిస్తున్నట్లు వంశీచంద్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభమైందని ఇప్పటికే అబ్జర్వర్సు రాష్ట్రానికి చేరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగురు వెంకటేశ్, రాములు, అంజయ్య, గుజ్జల మహేష్ యాదయ్య గౌడ్, లక్ష్మయ్య,బిక్షపతి, యాదగిరి రెడ్డి,జాంగిర్ అలీ, జాంగిర్ బాబా, షాబుద్దీన్, సత్యం, మల్లేష్ గౌడ్, రాము నాయక్, ఆనంద నాయక్, బాల్రాజ్, చెన్నయ్య, క్యామ శేఖర్, శంకర్, రామకృష్ణ, సిలారి, శ్రీశైలం,మల్లయ్య రాజేష్, జవహర్లాల్,తులసిరాం, నరసింహ, యాదయ్య చెన్నయ్య హరిపు ఫరీదో అనిల్ కుమార్ లకపతి, నాయక్ ఇమ్రాన్ బాబా, అస్గర్ అలీ, మల్లయ్య, బలరాం నాయక్, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ
కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ విభాగంగా పనిచేస్తుందని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసిసి ఇన్చార్జి  చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు....
మాజీ ఎంపిటిసిలు, సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడి
హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి
విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
భద్రతా ప్రమాణాలు పాటించండి - లేదంటే ఉక్కుపాదం తప్పదు
RTC ఛార్జిలను పెంచడం సరికాదు
Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్

Advertise