ఫిరోజ్ గూడలో ఆర్చ్ ప్రారంభోత్సవం
ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతులమీదుగా కార్యక్రమం
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ముఖద్వారం (కమాన్)ను ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ డివిజన్ ఫిరోజ్ గూడలో ప్రారంభించారు.
ఈ కమాన్ నిర్మాణం కోసం కృష్ణారావు తమ స్వంత నిధుల నుండి రూ.25 లక్షలు ఖర్చు చేశారు. భక్తుల సౌకర్యార్థం నిర్మాణం పూర్తయిన అనంతరం, ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభోత్సవం చేసి ప్రజల సేవలో అంకితం చేశారు. తదనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం మాట్లాడుతూ., “ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని , సాంస్కృతిక వారసత్వాన్నీ కూడా కాపాడటం నా కర్తవ్యం. స్థానికులు భక్తుల కోరిక మేరకు కమాన్‌ను నిర్మించడం సంతృప్తిని కలిగించింది అని అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి , కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, సతీష్ గౌడ్, ఖాజా, సుధాకర్ రెడ్డి, ఎడ్ల ప్రభాకర్, శ్రీనివాస్, మచందర్, ఎడ్ల సదానంద్, యాదయ్య, సూర్యనారాయణ, ఎడ్ల అశోక్, యెర్ర మహేష్, మల్లారెడ్డి, పాశం కృష్ణ యాదవ్, ఎడ్ల శ్యాం, ఎడ్ల మనోజ్ కుమార్, స్థానిక భక్తులు, పెద్దలు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat