అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక

తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించారు అధికారులు

On
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక

ఆర్.పి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాహా వేడుక భగంగా, సమాజంలోని నాయకులు, అధికారులు, యూహెచ్డీఎస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపీఓ రేణుక హాజరయ్యారు. హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్ శివం, అంగన్వాడీ టీచర్లు, హెడ్ మాస్టర్ తో పాటు గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251015-WA0068
ఈ సందర్భంగా 0-2 సంవత్సరాల పిల్లలకు “1000 Days Nutrition” ప్రాధాన్యతపై చర్చించారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించారు.
ముఖ్యంగా “బాలల పెంపకం”, సానిటేషన్, స్వచ్ఛతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాలలలో లెర్నింగ్ డెవలప్‌మెంట్, బ్రెయిన్ డెవలప్‌మెంట్ అంశాలపై ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 80% హాజరు నమోదు కావడం ఈ కేంద్రానికి ప్రత్యేక సత్కారంగా నిలిచింది. 3–6 సంవత్సరాల పిల్లల అంగన్వాడీ డ్రాయింగ్ కార్యక్రమాలను ప్రదర్శించారు. తల్లిపాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. అంగన్వాడీ సూపర్వైజర్, సహాయ సిబ్బంది అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
 

Publisher

Namasthe Bharat
 

About The Author

Share On Social Media

Related Posts

Latest News

అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక
ఆర్.పి కాలనీ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాహా వేడుక భగంగా, సమాజంలోని నాయకులు, అధికారులు, యూహెచ్డీఎస్ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...
మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం
పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా
దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం
చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్
భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా

Advertise