బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి

బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని

On
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి

బీసీ బిల్లును పార్లమెంట్లో వెంటనే ప్రవేశ పెట్టి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి - వామపక్ష పార్టీల డిమాండ్

బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ, ఉపాధిలో 42శాతం రిజర్వేషన్ కలిపించాలని, బీసీ జేఏసీ, సీపీఐ, సిపిఎం, వామపక్షల పార్టీలు బీసీ ఫర్ జస్టిస్ నినాదంతో తెలంగాణ బంద్ లో భాగంగా బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతి నగర్ మూడు కోతుల చౌరస్తా నుండి ప్రగతి నగర్ కమాన్ మీదుగా మూడు కోతుల చౌరస్తా వరకు సీపీఐ, సిపిఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమనికి సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్, సిపిఎం మండల నాయకులు ఎం.చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె. యేసు రత్నం, సీపీఎం జిల్లా నాయకులు వెంకట రామయ్య ముఖ్య అతిథులుగా వచ్చారు.

IMG-20251018-WA0080

అనంతరం వారు మాట్లాడుతూ 1970దశకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల పోరాటాలు ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో పెరియార్ రామస్వామి, జయప్రకాష్ నారాయణ లాంటి అనేక మంది మేధావులు అనేక పోరాటాలు నిర్వహించారు అని గుర్తు చేశారు. అనంతరం 1979లో బీసీల సామజిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి కోసం మండల కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

దానిని జీర్ణించుకొని కొంత మంది మతోన్మాద శక్తులు మండల కమిషన్ కు వెతిరేకంగా కమండల్ ఉద్యమని తీసువచ్చి, ఆనాడు బీసీ లకు అన్యాయం చేశారు అని గుర్తు చేశారు. అప్పుడు పోరాటాల వల్ల తమిళనాడు రాష్టంలో బీసీలకు 50శాతం రిజర్వేషన్ అమలు అయినా, బీసీ ద్రోహులు ఇది భారత దేశ వ్యాప్తంగా అమలు అవుతుంది అనే ఆలోచనతో సుప్రీంకోర్టులో వేయడం వల్ల సుప్రీంకోర్టు మొత్తంగా 50శాతనికి సిజ్ చేసిందని తెలియజేసారు.

IMG-20251018-WA0081

అప్పడి నుండి అనేక సార్లు ఆడపదడప బీసీ పోరాటాలు జరుగుతున్న అంతగా చర్చలోకి రాలేదు. గత కొంతకాలంగా బీసీ పోరాటం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ బీసీకి మేము అనుకూలం ప్రకటించిన తరువాత బీసీలకు 42శాతం ఇస్తాము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ కు పంపడం జరిగింది అని అన్నారు. ఇప్పుడు అదే మతోన్మాద, బీజేపీ పార్టీ బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టకుండా కాలయాపన చేస్తుంది. కనుక వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టలని, అలాగే రాగ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున బీసీ, ప్రజలను చేతన్యం పరిచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హేచ్చరించారు.

ఈ కార్యక్రమం సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నికంటి దస్తగిరి, కె. శివ, కె. మల్లయ్య, సీపీఎం నాయకులు వెంకట రాజ్యం, బాల వెంకటేశ్వర్లు , కృష్ణయ్య, శంకర్ రావు, భారత్, లక్ష్మణ్, బాలుపిరు, సంతోష్ రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్ JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
పోలీస్ అమ‌ర‌వీరుల దినోత్స‌వం సంద‌ర్భంగా జీడిమెట్ల పోలీసులు ఇచ్చిన రక్త‌దాన పిలుపుకు వంద‌లాది మంది త‌ర‌లొచ్చారు. శ‌నివారం ఉద‌యం పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన మ‌హార‌క్త‌దాన శిబిరంలో జీడిమెట్ల...
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు
Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు
భర్త మరణంతో మనస్థాపం - దశదినకర్మ నాడు భార్య అంత్యక్రియలు

Advertise