Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్
మహాదేవపురంలో పార్క్ స్థలాన్ని కాపాడిన వైనం
Hydrabad Disaster Response and Asset Protection Agency (హైడ్రా ) మరో సారి గాజులరామారంలో దూకుడుగా వ్యవహరించింది. దాదాపు 1200 గజాల స్థలానికి ఫెన్సింగ్ వేసింది. కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం గ్రామా ప్రభుత్వ భూమి కలిగి ఉన్న సర్వే నెంబర్ 394/4 నుండి 329/10లో సర్కారీ గైరన్ భూమిని కబ్జా చేసి మహాదేవపురం లేఔట్ తయారు చేసి కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు లేఔట్ వేసిన బిల్డర్స్. అయితే ఆలేఔట్ లో దాదాపు 12 ఎకరాలు ప్రజా సౌకర్యాల కోసం వదిలేసారు. అయితే హైదరాబాద్ నగరంలో అమాంతంగా భూముల విలువలు పెరగడంతో పార్కులు, బస్టాపులు ఇతర ఏమినిటీస్ కు వదిలేసినా భూములను సైతం అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేస్తున్నరు. మహాదేవపురంకు మూడు సార్లు లేఔట్ లు మార్చేసి పార్క్ స్థలాలను మాయంచేసారు.
గతంలో బాధ్యతలు నిర్వర్తించిన తహసీల్దార్ మహాదేవపురం కాలనీకి విద్త్యుత్ మీటర్లు , నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని సర్కులర్ సైతం జారీచేసిన, ప్రస్తుత మున్సిపల్ అధికారులు , రెవిన్యూ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అన్నపూర్ణ మాత మందిరం వద్ద ఖాళీగా ఉన్న పార్క్ స్థలాన్ని బేరానికి పెట్టారని తెలిసికొందరు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చెయ్యగా వారు ఇవ్వాల ఉదయం నుండి పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేస్తున్నారు. ఈ భూమి విలువ దాదాపు 15 కోట్ల రూపాయలు ఉంటుందని స్థానికులు తెలిపారు.
Publisher
Namasthe Bharat