VOTE CHOR : ఓట్ చోర్ కార్యక్రమం విజయవంతం చెయ్యండి
పదవులు శాశ్వతం కాదు, పార్టీ పటిష్టతకు కొరకు పనిచేయ్యండి : బండి రమేష్
పార్టీలో ఎవరికైనా పదవులు శాశ్వతం కాదని పార్టీ పటిష్టతకు శక్తిమేర కృషి చెయ్యాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, జహీరాబాద్ పార్లమెంటు ఇంచార్జ్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రతి ఇంటి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం రమేష్ బ్లాక్, డివిజన్ అధ్యక్షులతో పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ప్రోత్సహించేపట్టిన ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు కార్యకర్త పైన ఉందన్నారు. వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఓట్ చోర్ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి సంతకం సేకరణ జరగాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని సీట్ ఎవరికి వచ్చిన అభ్యర్థి విజయానికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో ఏ బ్లాక్ అద్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి బి బ్లాక్ అద్యక్షులు తూము వేణు, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్, మేకల రమేష్, సతీష్ గౌడ్, మొయిజుద్దీన్, కృష్ణ రాజ్ పుత్, మల్లికార్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat