స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా

స్టేటస్-కో నిబంధలను ఉల్లంగిస్తున్న పిటిషనర్, ఆర్డర్ కాల పరిమితి ముగిసిన చర్యలు తీస్కొని అధికారులు

On

  • నాట్ టూ ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని ఫిర్యాదు దారులకు తప్పుద్రోవ పట్టిస్తున్న అధికారులు
  •  HYDRAA పై భారం వేసి చేతులు దులుపుకున్న రెవిన్యూ 
  • చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ 
1006352127

జ్యూడిషియల్ వ్యవస్థను మోసం చేస్తూ తెలంగాణ గౌరవ హై కోర్టునే తప్పు దోవ పట్టిస్తూ అసైన్డ్ తోపాటు ప్రభుత్వ భూమి కబ్జాకు పాలుపడ్తున్నారు కొందరు ప్రబొద్దులు. 2024వ సంత్సరంలో 75 గజాల నాలుగు ప్లాట్లలకు నిర్మాణ అనుమతులు ఇవ్వాలని దుండిగల్ మున్సిపాలిటీకి TSBPASSకు దరఖాస్తు చేసుకుంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అనుమతులు ఇవ్వడంలేరని కోర్టును ఆశ్రయించి పిటిషన్ వేశారు. అది అడ్మిషన్ సమయంలోనే ఆకేసుకు "నో ఆర్డర్ యజ్ టూ కాస్ట్" అంటూ పిటీషన్ సస్పెండ్ చేస్తూ డిస్పోజ్ చేసింది. చింతపండు చచ్చిన పులుపు చావలేదు అన్నట్లుగా, బుద్ది మార్చుకోకుండా కొన్నేళ్లు సైలెంటుగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం మారగానే మల్లి కోర్టును ఆశ్రయించి తహసీల్దార్ నోటీసును సవాల్ చేస్తూ న్యాయస్థానం నుండి స్టేటస్-కో ఆర్డర్ తెచ్చుకొని, ఆర్డర్ యొక్క నిబంధనలు ఉల్లంగిస్తూ, నిర్మాణ పనులు చేపడుతూ., జులై 2025లో ముగిసిన స్టేటస్-కోను చూపిస్తూ అసైన్డ్ భూమితో పాటు, దాదాపు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేస్తున్నారు అక్రమార్కులు. 

దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి గ్రామంలో ఏమి జరుగుతుంది.?
1006352142

మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్-గండి మైసమ్మ మండలం పరిధిలోని దొమ్మర పోచంపల్లి గ్రామం సర్వే నెంబర్ 120, 120/1, 120/1/Aలో ఉన్న ప్రభుత్వ జాగాలో అప్పమాగారి రామ్ రెడ్డి అనే వ్యక్తి కనుసన్నంలో సీసీ కెమెరాల పహారాలో రాత్రనక పగలనక గదులు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులో సర్వే నెంబర్ 120లో దాదాపు స్థలం ప్రభుత్వానిదని రికార్డుల్లో ఉండగా అందులో కొంత భాగం అస్సైన్డుగా ఉంది. అయితే కొంతకాలం క్రింద భూపెత్తందారులు, వ్యాపారాలు స్థానికంగా ఉన్న రైతులు అస్సైనీలు వద్ద, ప్రస్తుతం కోట్ల విలువ చేసే భూమిని వేల రూపాయలకు కొన్నుకున్నారు. కానీ అయొక్క భూమిలో నిర్మాణాలు చేపట్టరాదు. కొందరు అతితెలివితో వారు కొన్నదానికన్నా ఎక్కువ, ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు.  ఒకవేళ నిర్మాణాలు చెయ్యాలన్న మార్కెట్ విలువ ప్రకారం  జిల్లా కలెక్టర్, సిసిఎల్ఏ, ప్రభుత్వం వద్ద నుండి క్లీరెన్సు పొందాలి. కానీ అలాంటి రూల్స్ ఏమి పాటించుకోకుండా నిర్మాణాలు చేపడితే అవి కూల్చివేత చేపట్టే హక్కు స్థానిక తహసీల్దార్ కు ఉన్న ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉందని సాకులు చెప్తున్నారు. హైడ్రాకు ఫైలును ఫార్వడ్ చేశామని HYDRAA అధికారులు చర్య తీసుకుంటారని రెవిన్యూ అధికారులు బదులుయిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన లోకల్ బాడీస్ చిత్త శుద్ధి చూస్తుంటే యాక్షన్ లేకుండానే నిర్మాణాలకు సహకరించే విదంగా ఉందని స్థానికులు తెలుపుతున్నారు. 

IMG20251011141137

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాబంధువు అంటూ అధికారులకు సవాల్ 

ప్రభుత్వ భూమిని రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYDERABAD DISASTER MANAGEMENT AND ASSETS PROTECTION AGENCY (హైడ్రా) లాంటి వ్యవస్థ తీస్కోవచ్చి ప్రజస్థులు, ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడుతూ, ఆక్రమణ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తూ కూల్చివేస్తుంటే

1006370162

దుండిగల్ గండిమైసమ్మ సర్వే నెంబర్ 120లో ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడ్తున్నవారు రేవంత్ రెడ్డి మాబంధువు అని చెప్పుకొని అక్రమానికి పాల్పడుతున్నారని గుసగుసలు వినపడ్తున్నాయి. తన జాగాలో నిర్మిస్తున్న ఆక్రమణలపై అధికారులు ఎవ్వరు చర్యలు తీసుకున్న, వారిని సస్పెండ్ట్ లేదా ట్రాస్ఫర్ చేపిస్తానని గతంలోనూ అలాంటివి చేపించానని తెలియజేస్తూ సవాల్ విసురుతున్నారు. 

స్టేటస్-కో నిబంధలను ఉల్లంగిస్తు, సమయం ముగిసిన ఆర్డర్ తో చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే చేసేదే ప్రభుత్వ భూమి కబ్జా మల్లి ముఖ్యఖ్యమంత్రి పేరును బద్నామ్ చేస్తూ అభాసుపాలు అయ్యేవిదంగా వ్యవహరిస్తున్నా వారిపై ఆపార్టీ నాయకులు స్పందించి కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. 

Publisher

Namasthe Bharat 

About The Author

Share On Social Media

Latest News

Advertise