రజనీ, కమల్ మల్టీస్టారర్ సినిమాలు ఎందుకు చెయ్యరు!
సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్‌లను ఒకే తెరపై చూడాలని తమిళ అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు మెగాస్టార్ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కలయిక త్వరలోనే సాకారం కావాల్సిన అవకాశాలు కనిపించటం లేదు.ముందుగా, లోకేష్ కనగరాజ్ ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. కానీ రజనీకాంత్ ‘కూలీ’ చిత్రం flop కావడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడినట్టు సమాచారం. దీంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది.ఇటీవల మరో వార్త బయటకు వచ్చింది. యువ దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు గుప్పుమంది. ప్రదీప్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి హిట్స్‌తో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు. అయితే, తన తాజా చిత్రం ‘డూడ్’ ప్రమోషన్ సమయంలో ప్రదీప్ స్పష్టత ఇచ్చారు: “ప్రస్తుతం నా ఫోకస్ పూర్తిగా నటనపైనే ఉంది. రజనీకాంత్-కమల్‌హాసన్ సినిమాకు నేను డైరెక్టర్ కాదు,” అన్నారు.ప్రదీప్ వ్యాఖ్యలతో రజనీ-కమల్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మళ్ళీ ఆగిపోయినట్టే భావిస్తున్నారు. దీర్ఘకాలం ఆపేక్షలో ఉన్న అభిమానులకు ఈ కలయిక త్వరలో కాదనే విషయం స్పష్టమైంది. ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘డూడ్’ చిత్రం అక్టోబర్ 17న విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.