Category
AP జిల్లాలు
AP జిల్లాలు 

రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : సొసైటీ చైర్మన్ రామకృష్ణ

రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : సొసైటీ చైర్మన్ రామకృష్ణ ఘనంగా సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా పితాని వెంకట్, పార్టీ శ్రేణులు పండితవిల్లూరు సొసైటీ అభివృద్ధికి, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన త్రిసభ్య కమిటీ చైర్మన్ పిల్లి రామకృష్ణ అన్నారు.పండితవిల్లూరు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అట్టహాసంగా, ఘనంగా నిర్వహించారు.   ఆచంట ఎమ్మెల్యే శాసనసభ హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్, టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు,  మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశానికి రైతే వెన్నుముకని, రైతుల అభివృద్ధికి సొసైటీలు ఏర్పాటు జరిగిందని అన్నారు. పిల్లి రామకృష్ణ రైతు కావడం, వారి సమస్యల పరిష్కారానికి,   సంక్షేమానికి మేలు జరుగుతుందన్నారు. అధ్యక్షుడిగా  పిల్లి రామకృష్ణ , సభ్యులుగా నామాల శ్రీనివాసు, కడలి విజయ లక్ష్మీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు గణపతినీడి రాంబాబు  మాట్లాడుతూ సొసైటీ ద్వారా నూతన పాలకవర్గం రైతులుకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి కొరిపల్లి రామచంద్రరావు, మాజీ సర్పంచి మాజీ సొసైటీ అధ్యక్షులు కానుమిల్లి మోహనరావు, జడ్పిటిసి మాజీ సభ్యుడు బొక్క నాగేశ్వరావు, టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జ్ రుద్రరాజు రమేష్ రాజు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు రుద్రరాజు రవిరాజు, పెనుమంట్ర నీటి సంఘం డిసి చైర్మన్ కర్రీ బుల్లి రామిరెడ్డి, మార్టేరు టిడిపి గ్రామ అధ్యక్షులు కోనాల శ్రీనివాసరెడ్డి, మార్టేరు మాజీ సర్పంచి కారేపల్లి భాస్కరరావు, టిడిపి గ్రామ అధ్యక్షుడు నామాల శ్రీనివాస్, కార్యదర్శి పుట్ల సుబ్రహ్మణ్యం, పోడూరు నీటి సంఘం అధ్యక్షులు కే రామకృష్ణ, శివాలయం చైర్మన్ దొంగ నాగేంద్ర, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు లింగోలు శ్రీనివాస్, టిడిపి నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, సదమళ్ల బుల్లిరాజు, తోట రామకృష్ణ, వాసంశెట్టి బాబురావు పాల్గొన్నారు.
Read More...