విషాదం : బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
మహబుబాబాదులో ఘటన, విషాదఛాయల్లో ఎంచగూడెం గ్రామం
On
మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య-స్వాతి దంపతుల కుమారుడు రితిక్, నర్సయ్య సోదరి అనిత-శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. కుటుంబ సభ్యులు అందరు వారి బంధువులు చనిపోవడంతో వేరే గ్రామానికి వెళ్లారు. వీరు ఇద్దరు ఇంటివద్ద ఉన్నారు. ఇంటి పక్కనే ఉన్న వ్యవసాయబావి వద్ద ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు. బావి వద్ద చెప్పులు బట్టలు ఉండడంతో గ్రామస్తులు వెతకడంతో ఇటికాల రితిక్ అనే బాలుడి మృతదేహం లభ్యమైంది.
సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి గ్రామస్తుల సహాయంతో మరో బాలుడు జతిన్ మృతదేహం కూడా లభ్యమైంది. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Publisher
Namasthe Bharat
About The Author
Tags
Latest News
12 Oct 2025 12:12:54
కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి అనుబంధ విభాగంగా పనిచేస్తుందని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడు, డిసిసి అధ్యక్షుల నియామక ప్రక్రియ ఏఐసిసి ఇన్చార్జి చల్లా వంశీచంద్ రెడ్డి ఆరోపించారు....