చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్

రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోతే, చిట్టినాడ్ ఫ్యాక్టరీని మూయించేస్తాం : ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి 

On

చిట్టినాడ్ ఫ్యాక్టరీ ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే రైతులతో కలిసి ధర్నా చేయడం జరుగుతుందని అదేవిధంగా ఫ్యాక్టరీ మూయించే పరిస్థితి వస్తుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని సంగెం కలాన్ వద్ద నిర్మించిన చిట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్లక్ష్యపు బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా కొన్ని రోజుల క్రితం పడిన వర్షాలతో సంగెం కలాన్ గ్రామ రైతుల పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం ఇవ్వడంలో  అలసత్వం వహిస్తున్నారని తెలుసుకున్న ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫ్యాక్టరీ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.

బిజెపి నాయకులతో కలిసి రైల్వే ట్రాక్ వద్ద మరియు నాశనమైన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఎంతవరకు నష్టం జరిగిందని చర్చించారు.IMG-20251014-WA0057 

సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో రైతుల పొలాలు సమస్యలపై చర్చించారు. సిమెంట్ అమ్ముకొని డబ్బు సంపాదిస్తారు కానీ రైతులు నష్టపోతే పరిహారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అంటూ మండిపడ్డారు. రైతులేమీ బిచ్చగాళ్లు కాదని మీరేమీ బిచ్చం వేయాల్సిన అవసరం లేదని మీ ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వకుంటే  ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపడతానని ఫ్యాక్టరీ యాజమాన్యానికి హెచ్చరించారు. ఫ్యాక్టరీ ముయించడానికి కూడా వెనకాడమని పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానని రైతులకు భరోసా కల్పించి హామీ ఇచ్చారు.  ఎంపీ తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్,కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తదితరులు ఉన్నారు.

Publisher

Namsthe Bharat

About The Author

Share On Social Media

Latest News

పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు పురపాలక కమిషనర్ హెచ్చరిక రాజేంద్రనగర్ : పరిశుభ్రత పాటించని పలు హోటళ్లపై బండ్లగూడ జాగిర్ పురపాలక అధికారులు కొరడా ఝ...
దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం
చిట్టినాడ్ ఫ్యాక్టరీ పై కొండా సీరియస్
భాగ్యనగరంలో దారుణం - ఇద్దరు పిల్లలను చంపినా తల్లి
స్టేటస్-కో ఆర్డర్ పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా
విజయరాజే సింధియా జయంతి - నివాళులు అర్పించిన నరేంద్ర మోదీ
బీజేపీ ఓటు చోరీ - సంతకాల స్వీకారణ

Advertise