ఉరిశిక్ష విధించండి లేదంటే మాకు అప్పజెప్పండి
ప్రేమించిన యువకుడు నరేష్ పెళ్లి చేస్కుంటానని మోసం చెయ్యడంతో నందిని ఆత్మహత్య
వికారాబాదులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రేమికుడు నరేష్ దిష్టిబొమ్మ దహనం చేసిన తండా వాసులు, ఉరిశిక్ష వెయ్యలని డిమాండ్
వికారాబాద్ మండలంలోని లాల్‌సింగ్ తండాలో దసరా పండుగ నాడు విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడు నరేష్ పెళ్లి చేసుకోకుండా మొహం చాటేయడంతో తమ కూతురు నందిని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి, నిందితుడు నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితునికి వెంటనే కఠిన శిక్ష విధించాలని వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.
అధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నందిని కుటుంబానికి న్యాయం చేయాలని ర్యాలీలో పాల్గొన్న వారు కోరారు. నిందితుడు నరేష్ కు ఉరిశిక్ష విధించాలని లేదంటే తమకు అప్పజెప్పండి అంటూ వారు ఆవేదన చెందారు.
Publisher
Namsthe Bharat