విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది

దేవనార్ బ్లైండ్ స్కూల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

On
విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది

సంకల్పబలం ముందు అంగవైకల్యం పెద్ద అవరోధం కాదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ తో కలిసి సోమవారం ఆయన బేగంపేట ప్రకాష్ నగర్ లోని దేవనార్ బ్లైండ్ స్కూల్ విద్యార్థులతో యాజమాన్యం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు.వారితో కలిసి బాణాసంచా కాల్చి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులకు బహుమతులను అందజేశారు. 

IMG-20251020-WA0085

ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ., సాధించాలనే పట్టుదల ఉంటే అంగవైకల్యాన్ని  అధిగమించవచ్చని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి  జీవితంలో  ఉన్నత స్థాయిని చేరుకోవాలని సూచించారు.

అలాగే రమేష్ మాట్లాడుతూ., దీపావళి పండుగను ఈ విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, అంగవైకల్యాన్ని అధిగమించి ఇక్కడ విద్యార్థులు అందరూ అందరిలాగే జీవితాన్ని అనుభవించాలని ఆకాంక్షించారు. ఇలాంటి విద్యార్థులకు విద్య నేర్పిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా రమేష్ అభినందించారు.  

IMG-20251021-WA0011

నిర్వాహకులతో పాటు డివిజన్ ప్రెసిడెంట్  రమేష్,   రమాదేవి , విశాల్, అరుణ్, పర్వేజ్, భరత్, సురేష్ , మోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

#SocialMedia - తప్పుగా వాడకండి.! #SocialMedia - తప్పుగా వాడకండి.!
అక్టోబర్ 18న జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో చింతల్ భాగ్యరధి డిగ్రీ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, సమాజానికి తమ సేవను అందించారు....
#TGSPDCL : మెయింటెనెన్స్
విజయం సాధించడానికి అంగవైకల్యం అడ్డు కాదు సంకల్పబలం చాలా గొప్పది
RSS శ‌తాబ్ది ఉత్స‌వాలు
Medchel : భారీగా రెవెన్యూ అధికారుల బదిలీలు
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి

Advertise