GHMC - బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న సర్కిల్ 2 ఏఈ
అసిస్టెంట్ ఇంజినీర్ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విజయేందర్ రెడ్డి డిమాండ్
రామంతపూర్ భగయత్ కాలనీ, వెంకట సాయి నగర్, సాయి కృష్ణ కాలనీలో బీరప్ప దేవాలయం వెనుక లైన్‌లో సాంక్షన్ అయిన బాక్స్ కల్వర్ట్ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి ప్రశ్నించగా, “బాక్స్ కల్వర్ట్ మరోచోట వేస్తాం” అని సర్కిల్-2 ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు.
దీంతో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి వెంటనే జీహెచ్ఎంసి సర్కిల్-2 డిప్యూటీ కమిషనర్ రాజును కలిసి వివరాలు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిఈ నాగమణి, ఏఈ మౌనికను పిలిచి వివరణ కోరగా, ఆమె తప్పు సమాచారం ఇచ్చారు. “ఆ లొకేషన్‌లో కల్వర్ట్ సాంక్షన్ కాలేదు. టెక్నికల్ రిపోర్ట్ ప్రైవేట్ వ్యక్తులతో చేయించుకున్నారు. మేము ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు,” అని ఏఈ మౌనిక పేర్కొంది.
ఈ సందర్భంలో జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి తన మొబైల్ లో జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కు టెక్నికల్ రిపోర్ట్ చూపించారు. అదే సమయంలో పై అధికారులకు ఎందుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అని అడిగితే, ఏఈ మౌనిక “మీరు ఎవరు నాను అడగడానికి? మా ఇష్టం వచ్చిన చోట మేము వేస్తాం. మాకు ఎక్కడ వేయాలో తెలుసు,” అంటూ పై అధికారుల సమక్షంలో అవమానకరంగా ప్రవర్తించింది.
జర్నలిస్ట్ విజయేందర్ రెడ్డి మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన ఏఈ మౌనికపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, విధుల నుంచి తొలగించాలని ఆయన జీహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. “ఒక బాధ్యత గల జర్నలిస్టుతో ఇలా మాట్లాడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.
త్వరలో ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, జీహెచ్ఎంసి కమిషనర్, జోనల్ కమిషనర్, లోకాయుక్త జడ్జి వద్ద ఫిర్యాదు చేయనున్నట్లు విజయేందర్ రెడ్డి తెలిపారు.
Publisher
Namasthe Bharat