Category
మేడ్చల్
మేడ్చల్ 

ప్రాణాలు కాపాడండి సారు ! 

ప్రాణాలు కాపాడండి సారు !  అధికారులు చొరవ చూపి రోడ్డును బాగుచేయలంటున్న వాహనదారులు, స్థానికులు డిమాండ్
Read More...
మేడ్చల్ 

బతుకమ్మ పండగకు ఏర్పాట్లలకు ఆదేశం

బతుకమ్మ పండగకు ఏర్పాట్లలకు ఆదేశం భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే పూలతో బతుకమ్మను చేసి గౌరమ్మను పూజించే సంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Read More...
మేడ్చల్ 

నిఖిల్ నాయక్ MISSING - PLEASE SHARE

నిఖిల్ నాయక్ MISSING - PLEASE SHARE మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  బోరంపేట ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉండే  రవీంద్రనాథ్ నాయక్ కొడుకు, నిఖిల్ నాయక్ 15 సంవత్సరాలు, పదవ తరగతి చదువుతున్నాడు, తల్లితండ్రులు, ఎన్నిసార్లు అడిగినా  ఫోన్ కొనివ్వడం లేదని, ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయాడు, ఈ ఫోటోలో కనిపిస్తున్న, విద్యార్థి, ఎవరికైనా కనబడితే, దుండిగల్...
Read More...
మేడ్చల్ 

ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి

ఇందిరమ్మ పేస్ -3 పార్కును కాపాడండి అధికారికి వినతి పత్రం అందించిన సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్
Read More...
మేడ్చల్ 

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో లింగాల గంగాధరుకు కీలక పదవి

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో లింగాల గంగాధరుకు కీలక పదవి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ కోర్ కమిటీ అధ్యక్షులు లింగాల గంగాధర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా లింగాల గంగాధర్కు పలువురు నేతలు, కార్యకర్తలు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట్ ప్రాంతానికి చెందిన గంగాధర్ కు ఈ పదవి దక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read More...
మేడ్చల్ 

రజాకార్లను తరిమి కొట్టింది కమ్యూనిస్ట్ లే

రజాకార్లను తరిమి కొట్టింది కమ్యూనిస్ట్ లే సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేసాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బీజేపీసిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ తెలంగాణ విలీన సాయుధ రైతాంగ పోరాట 77వ వారోత్సవాల ముగింపు సందర్భంగా నిజాంపేట్ వార్డు కార్యక్రమం వద్ద సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య జెండా ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ., తెలంగాణ రైతంగా సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్ట్లే , భూమి కోసం, భూక్తి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడింది కమ్యూనిస్ట్లే, బాంచన్ దొర కళ్ళు మోకుతా అనే నోరు లేని గ్రామీణ ప్రజలతో బంధుకులు పట్టించి పోరాటం చేసింది కమ్యూనిస్ట్ లే వీటిలో ఎలాంటి పాత్ర లేని వారు అంత మీమే చేశాము అనడం పూర్తిగా చరిత్రను వక్రీకరించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నకంటి దస్తగిరి, రాము, నర్సింహా, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు

అక్రమ విల్లాలపై చర్యలు తీసుకోవాలని - ఆకుల సతీష్, నల్ల జై శంకర్ గౌడ్ ఫిర్యాదు మేడ్చల్ గ్రామంలో సర్వే నంబర్లు 879, 881 పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటికి హెచ్ఎండిఏ నుంచి మాన్యువల్ అనుమతులు పొందడమే కాకుండా, చెరువులోనే నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్నారని గత నెలలోనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని. కానీ చర్యలు తీసుకోకపోవడంతో, సోమవారం అదనపు కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. మరోసారి మేడ్చల్ మున్సిపల్ మేనేజర్‌కు పూర్తి ఆధారాలతో పిర్యాదు అందజేశాం అన్నారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ అలాగే నల్ల జై శంకర్ గౌడ్ మాట్లాడుతూ., శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీ, మేడ్చల్ గ్రామంలో పెద్ద చెరువుకు ఆనుకొని సర్వే నంబర్లు 879, 881లో 24.31 ఎకరాల్లో (Proc. No.1064/MED/plg/HMDA/2022) విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో నిర్మాణాలకు మాన్యువల్ అనుమతులు హెచ్ఎండిఏ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు కూడా చెరువు పరిధిలో విల్లాల నిర్మాణానికి ఎన్వోసీ ఇవ్వడానికి కారణం, BRS పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాదాపు ₹100 కోట్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టడమేనని ఆరోపించారు. ఇప్పటికే చెరువులో 30 వరకు విల్లాలు అక్రమంగా నిర్మించబడుతున్నా, ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఎమ్మెల్యేల సహకారమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే BRS  2ఎమ్మెల్యేల అక్రమ పెట్టుబడులపై దర్యాప్తు జరిపి, మేడ్చల్ పెద్ద చెరువు ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లో మాన్యువల్ అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులపై విజిలెన్స్ విచారణ జరపాలని, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రేయస్ లైఫ్ స్పేసెస్ కన్స్ట్రక్షన్ కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చెరువును పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరుణ్ రావు, పి.బి. శ్రీనివాస్, ముకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్

45 లక్షల నిధులతో కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ ఫతే నగర్ డివిజన్ పరిధిలోని  పిట్టల బస్తీలో  కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో 45 లక్షల రూపాయల నిధులతో పిట్టల బస్తీ వాసుల కోరిక మేరకు స్థానికులతో కలిసి పనులను ప్రారంభించిరు  కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ., పిట్టల బస్సులో ST నిధుల కింద 90 లక్షల రూపాయలతో బస్తీ వారి కోసం స్మశాన వాటికను, రోడ్లను అదేవిధంగా కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మించుట కొరకు భూమి పూజ చేయడం జరిగిందని, అనంతరం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న యువత కొరకు జిమ్ ను  కూడా అతి త్వరలో యువత కొరకు అందుబాటులోకి తీసుకొస్తామని వారి హామీ ఇవ్వడం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిట్టల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోపి, జైపాల్ జయమ్మ, బబ్లు గణేష్, సుధాకర్, కంచి బిక్షపతి, గంగరాజు, కుక్కల రాము, బాగయ్య, రామ గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

అంత్యక్రియలకు ఆర్ధికసాయం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ, పిజెఆర్ నగర్ లో అనారోగ్యంతో బాధపడుతూ పి.శేఖర్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగ్ యాదవ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.
Read More...
మేడ్చల్ 

ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు

ఎమ్మెల్యే కృష్ణ రావును కలిసిన గ్రీన్ హిల్స్ కాలనీ వాసులు కుకట్పల్లి : గ్రీన్ హిల్స్ రోడ్డులో గల బహుల అంతస్తుల సముదాయలైన రెయిన్భో విష్టాస్ రాక్ గార్డెన్, మెరినా స్కై, రేయిన్భో విష్టా పేస్ 1 సంఘాలు సంయుక్తంగా శాసనసభ్యులు మాదవరం కృష్ణారావును కలిసి తమ ప్రదానసమస్య గ్రీన్ హిల్స్ రోడ్డు మీద పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించ వలసినదిగా కోరడం జరిగినది. దాదాపు 15 వేల మంది నివసిస్తున్న ఈ సముదాయాల నుండి మరియు ఇందులో ఉపాదికోసం రోజు వచ్చే 3వేల పైచిలుకు మహిళలు  నిత్యం వేల సంఖ్య లో రోడ్డు కు అటువైపు వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. రానున్న కాలంలో కొత్తగా రాబోయే సముదాయల ద్వారా వేల సంఖ్యలో నివాసాలు రాభోతున్న తరుణంలో పాదచారుల కు ప్రదాన సమస్య కు పుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుచేయించి రంగదాముని మార్గం నుండి మాధాపూర్ కు ప్లై ఓవర్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేసి  శాశ్వత పరిష్కారం చూపమని బండి మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో మూడు సముదాయాల సంఘాల సభ్యులు టి.సత్యనారాయణరెడ్డి, ఓంకార్ రెడ్డి, రామారావు, రామ్ తిలక్, సుమంత్ కుమార్ పాల్గొన్నారు. మాధవరం కృష్ణారావు సానుకూలంగా స్పందించి తక్షణం సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను అని తెలియజేశారు.
Read More...
మేడ్చల్ 

వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కీసర తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కీసర తహశీల్దార్ కార్యాలయం ముట్టడి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కీసర: మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ లోవికలాంగుల పెన్షన్ రూ 6,000/- పెంచాలని మరియు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 4,000/- పెంచాలని,కండరాల క్షీణత కలిగిన వారికి రూ. 15,000/- ఇవ్వాలని అలాగే దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కీసర మండల తహశీల్దార్ కార్యాలయం ముట్టడి చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS), చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS), మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS). ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల అయిన కూడా ఇప్పటివరకు పెంచిన పించన్లు ఇవ్వాలని కీసర మండల తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు.అనంతరం ఉప తహశీల్దార్ కి వినతిపత్రం అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు.వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పేర్కొన్నారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే స్థానిక ఎన్నికలలో వికలాంగుల పోరాటం ఏంటో చూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆవుల అల్లాజీ, టైగర్ నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, రాజు రెడ్డి, కృష్ణారెడ్డి, రమేష్ ,ముత్యం బాలస్వామి, దత్తు, చోటు మోహన్రావు ,భాగ్యమ్మ ,బిక్షపతి గౌడ్ ,విక్టోరి గైడెన్,కీసర మండల MRPS అధ్యక్షులు మంచాల మహేందర్ మాదిగ, మండల  ఇంచార్జ్ బుడిగె జగన్ మాదిగ, ఉపాధ్యక్షులు తుడుం శ్రీనివాస్ మాదిగ, శీలం మల్లేష్ మాదిగ, బందెల పరమేష్ మాదిగ, నల్ల చంద్రయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Read More...
మేడ్చల్ 

దూలపల్లి ZPHS పాఠశాలలో  హిందీ దివస్.!

దూలపల్లి ZPHS పాఠశాలలో  హిందీ దివస్.! హిందీ భాషా ప్రాముఖ్యత, గొప్పతనాన్ని వివరించిన ఉపాధ్యాయులు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండల కేంద్రంలోని దూలపల్లి విల్లేజి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ హిందీ దివస్ను సోమవారం ఘనంగా నిర్వహించారు. హిందీ దినోత్సవ నేపథ్యం, భాషా ప్రాముఖ్యత, భాషా నైపుణ్యత, గొప్పతనం గురించి వివరించారు స్కూల్ హెడ్ మాస్టర్ వేణు గోపాల్. ఈ సందర్భంగా ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థినీ విద్యార్థులు వివిధ సంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు. అలాగే గాగ్గిల్లాపూర్ సెప్టెంబర్ 10, 11, 12 తేదీలలో ఎస్జిఎఫ్ జోనల్ స్థాయి గేమ్స్ లో  పాల్గొన్న పాఠశాల విద్యార్థులు అండర్ 14, 17 విభాగంలో కబడ్డీ, కోకో లో మొదటి బహుమతి, వాలీబాల్ ఆటలో మొదటి రెండవ బహుమతి సాధించడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయిని గాయత్రి దేవి విద్యార్థులకు మంచిగా శిక్షణ ఇచ్చి ఎంతో కృషి చేశారని, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారందరినీ అభినందించరు. టీచర్స్ డే సందర్భంగా మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కాబడిన ఎం.శైలజ ఎస్ఏ తెలుగును సన్మానించరు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బ్రహ్మచారి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Read More...