RSS శతాబ్ది ఉత్సవాలు
వ్యక్తి నిర్మాణం, సమాజ మార్పే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లక్ష్యం | డా.అన్నదాన సుబ్రహ్మణ్యం
RSS శతాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మున్సిపల్ కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల గ్రామ రచ్చబండ హనుమాన్ దేవాలయం దగ్గర ప్రారంభమై పురవీధులు గుండా రహదారిపై సాగి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ వద్దకు చేరుకుంది.
అనంతరం మైదానంలో నిర్వహించిన సభలో ప్రధానవక్త గా తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు డా.అన్నదానం సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని తెలిపారు. 1925 లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తరిత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత,హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పని చేస్తుందని తెలిపారు.
హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తామని పేర్కొన్నారు.హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయం పరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు.ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటికి జాగరణ చేపట్టబోతుందని తెలిపారు.
దేశ అభివృద్ధి కొరకు పంచ పరివర్తన విషయాలైన సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, స్వదేశీ - స్వాభిమానం, పౌర విధుల ఆధారంగా స్వయంసేవకులు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశం కోసం, ధర్మం కోసం కంకణ బద్దులై పని చేస్తూ భారత దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేలా ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే భావన అందరిలో కలిగించాలని, కలసి పని చేసి ఉదారతను చాటుకోవాలని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, చేవెళ్ల ఆర్ఎస్ఎస్ ఖండా సంఘచాలక్ బిల్లపాటి కృష్ణారెడ్డి, అత్తేలి అనంత్ రెడ్డి, డాక్టర్ మల్గారీ వైభవ్ రెడ్డి, చిరుమని మైపాల్ రెడ్డి, సంబ మల్లేష్, కిచ్చన్నగారి వెంకట్ రెడ్డి, మద్దెల సురేందర్, వడ్డే సాయిరాం, దేవర పాండురంగారెడ్డి, చిలుకూరి శ్రీనివాస్, స్వయం సేవకులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat