బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!

ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసిన అక్రమార్కులు

On

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో  దౌర్జన్యం 

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు, కేసు నమోదు.!

ఊర్లకు వెళ్తే ఇండ్లలలో దొంగలు పడతారు, కానీ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండ JNNURM హౌసింగ్ సముదాయంలో ఏకంగా ఇండ్లనే కబ్జాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగులేదని చుట్టాల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఓ మహిళా ఇంటిని కబ్జా చేసి అమ్మేసారు. తదనంతరం దొంగ డాక్యూమెంట్లు సృష్టించి మహిళ పైనే కోర్టులో కేసు వేశారు.

1006341361

వివరాల్లోకి వెళ్తే.. ఒంటరి మహిళా అయిన వెన్జండ్ల జ్యోతికి 2009-2010 మధ్యకాలంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ JNNURM పధకం ద్వారా ఒంటరి మిహిళ కేటగిరీలో కూకట్పల్లి మండలం, శంశిగూడా గ్రామా శివారులోని ఎల్లమ్మబండ సర్వే నెంబర్ 57, 336 JNNURM ఫేస్ 2లోని అపార్ట్మెంట్ సముదాయంలో బ్లాక్ నెంబర్ 115 ఫ్లాట్ నెంబర్ 1TF లో ఇల్లు కేటాయించింది. దింతో జ్యోతి తనకు కేటాయించిన ఇంటిని రిపేరు చేయించుకొని జీవనం కొనసాగిస్తోంది. అయితే ఈ మధ్య ఆమెకు ఆరోగ్యం బాగు లేదని, చూసుకునే వారు ఎవ్వరు దగ్గర లేకపోవడంతో సికింద్రాబాద్, ఈస్ట్ మర్రేడుపల్లి, టీచర్స్ కాలనీ ఉన్న బంధువుల ఇంటికి తరచుగా వెళ్లి వచ్చేది. అయితే ఎనిమిది నెలల క్రింద ఆరోగ్య పరిస్థి క్షించడంతో ఆవిడా తన గృహానికి తాళం వేసుకొని తమ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది. 

1006319446

మల్లి ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఆఇంట్లో గుర్తు తెలియని కుటుంబం జీవనం కొనసాగించడం చూసి జ్యోతి షాక్ కు గురైంది. తాను వేసుకున్న తాళం పగలకొట్టి ఇంట్లోని సామాగ్రిని తీసేసి మీరు ఇక్కడ ఎలా ఉంటారని ప్రశ్నించింది. తాము తలారి సురేష్, కవిత అని తమకు ఈఇంటిని అదే ప్రాంతానికి చెందినసలీం, జాఫర్, శశి (శఫీ) అమ్మినారని తెలిపారు. ఆతరువాత జ్యోతి తెలంగాణ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాయి ఫుల్ ప్రజా భవన్ ప్రజా వాణిలో ఫిర్యాదు చేసింది. అయొక్క ఫిర్యాదు రాష్ట్ర హోమ్ శాఖ డీజీపీకి ఫార్వడ్ చేసారు అధికారులు.

1014_2025 1

తిరిగి బుధవారం నాడు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చెయ్యడంతో (క్రైమ్ నెంబర్ 1014/2025) ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అందులో తలారి సురేష్ (ఏ1), తలారి కవిత (ఏ2), సలీం (ఏ3), జఫ్ఫార్ (ఏ4), శశి (శఫీ) (ఏ5)గా చేర్చారు. తమ పేరుతో ఫేక్ డాక్యూమెంట్లు సృష్టించి ఇంటిని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే తన ఇంటిని ఇప్పించి న్యాయం చెయ్యాలని కోరింది జ్యోతి. 

Publisher

Namasthe Bharat         

About The Author

Advertise

Share On Social Media

Latest News

RTC ఛార్జిలను పెంచడం సరికాదు RTC ఛార్జిలను పెంచడం సరికాదు
పెంచిన RTC ఛార్జిలను తగ్గించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట బస్టాప్ వద్ద నిరసన చేపట్టరు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ., ప్రభుత్వం కొంతమంది పెట్టుబడిదారులకు కోట్లాది రూపాయలు...
Gajularamaram : హైడ్రా యాక్షన్ - పార్కు స్థలానికి ఫెన్సింగ్
బయటికి వెళ్తున్నారా.? అయితే మీ ఇల్లు కబ్జె.!
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ
ప్రభుత్వం అరెస్టులు - ప్రశ్నించడమే నేరమా
ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ
BC - తెలంగాణ బంద్ - తీన్మార్ మల్లన్న పిలుపు

Advertise