మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం
ప్రజలకు తప్పని ఇక్కట్లు
ప్రతి నీటి బొట్టు.. బంగారమే పొదుపుగా వాడుకుందామని సూక్తులు చెప్పే అధికారులు వేల లీటర్ల త్రాగునీటిని రోడ్ల పై వదిలేస్తున్నారు. చెరువులు నిండి ఊర్లన్నీ మునిగిపోయే దృశ్యాలని చూస్తుంటాం, కానీ జలమండలి వారి త్రాగునీరుతో కూడా ప్రజలు మునుగుతున్నారనే సిన్ ఎల్లమ్మబండలో కనిపించింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్, ఎల్లమ్మబండ ప్రాంతంలో గల ఎన్టీఆర్ నగర్ మస్జీద్ పక్క లైనులో గత కొంత కాలంగా త్రాగునీరు ఓవర్ ఫ్లో అవుతుండడంతో ప్రజలు ఇక్కట్లు పడ్తున్నారు. మొగాలమ్మ కాలనీకి అనుకోని 16 సంసత్సరాల క్రింద ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తో పాటు, డీప్ రిజర్వయర్ నిర్మించారు.
దాని దిగువ ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ సంబంధించి రెండు లైన్ల గృహ సముదాయాలు ఉన్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఎన్నడూ లేని విదంగా ఇండ్లలో వరద ప్రవాహం వస్తుంది. మంచి నీరు డ్రైనేజీ లోకి చేరి మురుగునీరు తో కలుషితమై మలమూత్రాలు సైతం ఇంట్లోకి వస్తుందని అక్కడివారు మండిపడ్తున్నారు. ఏ సమయంలో నీళ్లు ఇంట్లోకి వస్తాయో తెలియదని, వచినప్పుడుల్లా ఇంట్లోని పప్పులు బియ్యం ఇతర సామగ్రితో పాటు ఇంట్లోని సోఫాలు, అలమరాలు, దుప్పట్లు, బట్టలు నీట మునిగిపోతున్నాయని తెలిపారు.
ఈ సమస్య వల్ల తమ మామ గారు అవస్థకు గురై, ఇంట్లోకి చేరుతున్న నీటిని తోడి చలి జ్వరంతో గత నెల చనిపోయారని గాయత్రీ అనే మహిళాతో పటు అక్కడి స్థానికులు ఆరోపించింది. ఎన్ని సార్లు అధికారులకు తెలిపిన పాటించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ప్రతి జలమండలి రిజర్వయర్ పర్యవేక్షులు, ఆపరేటర్లు తప్పని సరిగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి సమస్య తీర్చాలని కోరుతున్నారు ప్రజలు.
Publisher
Namasthe Bharat