Category
నారాయణపేట్
నారాయణపేట్  

హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి

హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి ఉట్కూర్ మండలం : ప్రతి వర్షాకాలంలో మూడు గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడంలేదని సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మండల పరిధిలోని పులిమామిడి, బిజ్వార్, అవసలోనిపల్లి  గ్రామాల మధ్య రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ గ్రామాల మధ్య గల రహదారిపై  హై లెవెల్ బ్రిడ్జిలకు మోక్షం ఎప్పుడు, కలుగుతుందోనని సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
Read More...
నారాయణపేట్  

ఊరెళ్తున్నారా..జరభద్రం

ఊరెళ్తున్నారా..జరభద్రం కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం దసరా పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ  యోగేష్ గౌతమ్
Read More...
నారాయణపేట్  

మహిళ ఆరోగ్యమే కుటుంబ,సమాజ ఆరోగ్యం

మహిళ ఆరోగ్యమే కుటుంబ,సమాజ ఆరోగ్యం నారాయణపేట్ జిల్లా : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, ఆ తర్వాత సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామ శివారులో గల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి లో జాతీయ కార్యక్రమమైన "స్వస్థ్ నారి  శశక్త్ పరివార్ అభియాన్"  కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా నారాయణపేట శాసనసభ్యురాలు  డాక్టర్ పర్ణికా రెడ్డి , స్థానిక సంస్థల జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్  వార్ల విజయకుమార్ హాజరై ఉచిత "మెగా హెల్త్ క్యాంప్" ను ప్రారంభించారు. ఈ మెగా హెల్త్ క్యాంపు లో మహిళలు మరియు చిన్న పిల్లలను ఎక్కువ భాగస్వామ్యం చేయాలని ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఒక కుటుంబం శక్తివంతంగా ఉంటుంది అనే ప్రధాన లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని  శాసనసభ్యురాలు డాక్టర్. పర్ణిక రెడ్డి,అదనపు జిల్లా కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. జయచంద్ర మోహన్ తమ ప్రసంగంలో తెలిపారు. ఈ క్యాంపులో స్పెషలైజేషన్ డాక్టర్లను ప్రతి మండల కేంద్రాలలో మరియు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ప్రతిరోజు   (17.09.2025 నుండి 02.10.2025 వరకు) 12 రోజుల వరకు వివిధ కేంద్రాలలో క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అత్యధిక సంఖ్యలో మహిళలు,పిల్లలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో    మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. కే. జయచంద్ర మోహన్,  మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది  పాల్గొన్నారు.
Read More...
నారాయణపేట్  

తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి

తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి ఉట్కూర్ మండలం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.కర్ణాటక , మహారాష్ట్ర లో నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఆత్మకు శాంతి కలగాలంటే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.చాలా మంది తెలంగాణ విమోచన దినోత్సవం గురించి భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు విలీన దినం అని,మరికొందరు విద్రోహ దినం అని మరియు ఇంకొందరు విమోచన దినోత్సవం అని అంటున్నారు.ఒక్కసారి ఈ విషయాలపై విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా విమోచన దినోత్సవం మే సరియైనది అని చెప్పక తప్పదు.ఎందుకనగా విలీనం అంటే ఎలాంటి పోరాటం చేయకుండా శాంతి,చర్చల ద్వారా నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ లోని తెలంగాణ జిల్లాలను భారత దేశంలో కలిపితే విలీన దినోత్సవం అనవచ్చు కానీ నిజాం ప్రభుత్వం ఎన్నో పోరాటాలు,ఉద్యమాలు మరియు ఎంతో మంది తెలంగాణ అమరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత భయపడి భారతదేశంలో అంతర్భాగం చేశారు.కావున ఇది విలీనం కాదు అని అనిపిస్తుంది.విద్రోహ దినం అని మరికొందరు అంటున్నారు.ఎందుకంటే నిజాం పాలన ముగిసిన తర్వాత పటేళ్లు, పట్వారీ లు పేద ప్రజలను చాలా రకాలుగా పీడించి వారి భూములను స్వాధీన పరుచుకున్నాయి కావున విద్రోహ దినం అని అంటున్నారు. ఇది కూడా సరి అయినది కాదు అని అనిపిస్తుంది,ఎందుకంటే మనం పోరాటం చేసి తెలంగాణ జిల్లాలను నిజాం వారి నుండి భారత దేశంలో భాగంగా చేసుకున్నాము. పటేళ్ల నుంచి, పట్వారీ నుండి కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.చివరికి విమోచనం దినం.విమోచనం అంటే  మన తెలంగాణ జిల్లాలను హైదరాబాద్ స్టేట్ లోని నిజాం పాలన నుంచి స్వాతంత్ర్య భారత దేశంలో కలపాలని,మేము భారతీయులం కావున ప్రత్యేక దేశం గా ఉండాలనుకోవడం లేదు అని కులాలకు,వర్గాలకు అతీతంగా పోరాటం చేసి నిజాం పాలన కు ముగింపు పలికి స్వాతంత్య భారతంలో స్వేచ్ఛగా భారతీయులందితో హాయిగా,ఆనందంగా జీవితం గడపాలని నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటం చేసి సాధించుకున్నారు  కావున  విమోచన దినోత్సవం మే సరియైనది అని  మేధావులు,విద్యావేత్తలు మరియు సామాజికవేత్తల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కావున తెలంగాణ ప్రభుత్వం యావత్తు  ప్రజల ఆకాంక్ష మేరకు సెప్టెంబర్ 17 ను ప్రతి సంవత్సరం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించని విజ్ఞప్తి చేశారు.అదే విధంగా నిజాం తూటాలకు బలి అయిన తెలంగాణ వీరుల చరిత్రలను పాఠ్యాంశాలలో చేర్చి బోధించాలని కోరారు.తెలంగాణ తొలి మరియు మలి దశ ఉద్యమాలలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అమర వీరులు కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించి స్వాతంత్ర్య సమరయోధుల మాదిరిగా సౌకర్యాలు కల్పించాలని కోరారు.
Read More...
నారాయణపేట్  

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి* 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి*    నారాయణపేట్ జిల్లా :తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని  నారాయణపేట  జిల్లా కలెక్టరేట్ లో  ఈ నెల 17 న  ఉదయం 10 గంటలకు నిర్వహించే జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హాజరై  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని  కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళ  వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో ఎవరికి ఇచ్చిన బాధ్యతలను  వారు సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఆమె లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏవో జయసుధ, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read More...
నారాయణపేట్  

లయన్స్ క్లబ్ మఖ్తల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ..

లయన్స్ క్లబ్ మఖ్తల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.. నమస్తే భరత్,,,24,,,8=2025=నారాయణపేట జిల్లాలయన్స్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో శనివారం స్థానిక పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అన్న ప్రసాద వితరణ చేపట్టినట్లు లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు సత్య ఆంజనేయులు తెలిపారు. లయన్ శరణప్ప మనుమరాలు, గీతా అంబ్రెష్ ల కూతురు శ్రీనిక మొదటి పుట్టినరోజు పురస్కరించుకొని ఆలయ ఆవరణలో సుమారు 350...
Read More...
నారాయణపేట్  

శ్రీయుత గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు నారాయణపేట గార్కి.

శ్రీయుత గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు నారాయణపేట గార్కి.    విషయం:-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయుట గురించి.నమస్తే భరత్,,,24/8/2025/నారాయణపేట జిల్లాఅయ్యా తమరితో చేయు మనవి ఏమనగా మేము అనగా మక్తల్ నియోజకవర్గంలో నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులం గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి...
Read More...
నారాయణపేట్  

చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి

చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్ మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి.అభిమానుల మధ్య ఘనంగా పేట ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా తాత స్వర్గీయ చిట్టెం.నర్సిరెడ్డి,మా తండ్రి స్వర్గీయ. చిట్టెం. వెంకటేశ్వర్ రెడ్డిల ఆశయ సాధనలో మా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ...
Read More...
నారాయణపేట్  

సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలి

సిపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలి    ---ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి ---తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుషేర్ కృష్ణారెడ్డి, నరసింహ నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్   ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి  పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేర్  కృష్ణారెడ్డి, నరసింహ డిమాండ్జిల్లా...
Read More...
నారాయణపేట్  

వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో  ఉండి సేవలు అందించాలి కలెక్టర్

వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో  ఉండి సేవలు అందించాలి కలెక్టర్    నారాయణపేట జిల్లా / నమస్తే భారత్ రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మంగళవారం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి స్కానింగ్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని విభాగాలను పరిశీలించి వైద్యులతో వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సమస్యలు ఉంటే తనకు...
Read More...
నారాయణపేట్  

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి.

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలి.    ---నూతన సాంకేతిక వ్యవస్థ పై అవగాహన కలిగి ఉండాలి. ---ఫిర్యాదుదారులకు, బాధితులకు పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పించాలి. ---రాబోయే గణేష్ ఉత్సవాలకు ఎలాంటి సమస్యలు లేకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ---జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐ పియస్  నారాయణపేట జిల్లా / నమస్తే భారత్ పోలీస్ స్టేషన్ కు వచ్చే...
Read More...
నారాయణపేట్  

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్    నారాయణపేట్ జిల్లా / నమస్తే భారత్  దామరగిద్ద మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని మంగళ వారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు.  కేంద్రంలో  ఏ ఏ ఎరువుల ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేసి ఇంత వరకు ఎన్ని బస్తాల యూరియా విక్రయించారని చూశారు. రోజూ...
Read More...