భద్రతా ప్రమాణాలు పాటించండి - లేదంటే ఉక్కుపాదం తప్పదు
డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ వై మోహన్ బాబు హెచ్చరిక
- ప్రతి కార్మికుని ప్రాణం ఎంతో విలువైంది, కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యాలదే
- కౌన్సిల్ ఆఫ్ ఈహెచ్ఎస్ ప్రొఫెషనల్స్ (సిఈపి) ఆధ్వర్యంలో ఒక రోజు శిక్షణా తరగతులు
- ప్రమాదాల నియంత్రణ కొరకు పరిశ్రమలు కట్టుబడి ఉండాలని సూచనలు జారీ
కుత్బుల్లాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని డైరెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ వై మోహన్ బాబు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో కౌన్సిల్ ఆఫ్ ఈ హెచ్ ఎస్ ప్రొఫెషనల్స్ ( సిఈపి ) ఆధ్వర్యంలో పలు పరిశ్రమల ఉద్యోగులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ తరగతులలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో ప్రతి కార్మికుడు భద్రత పట్ల శిక్షణ పొందేటట్లు యాజమాన్యం శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ తరగతుల వల్ల ప్రమాదాల నివారణ చాలావరకు తగ్గుతుందని ఆయన అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చే నివేదికలు ముఖ్యం కాదని అన్నారు. ప్రతి పరిశ్రమ జీరో ప్రమాదాల స్థాయికి చేరినప్పుడే పరిశ్రమ 100% అభివృద్ధి సాధించినట్లు అవుతుందని ఆయన అన్నారు. భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని వారిపై ఉక్కు పాదం మోపుతుందని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల శిక్షణ కొరకు కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని ఇంటర్నెట్లో భద్రత ప్రమాణాలపై విషయాలు తెలుసుకొని సైతం క్రింది స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వచ్చని ఆయన అన్నారు.కౌన్సిల్ ఆఫ్ ఈ హెచ్ ఎస్ ప్రొఫెషనల్స్ ( సి ఈ పి ) వారు నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వారిని అభినందించారు.
కౌన్సిలల్ ఆఫ్ ఈ హెచ్ ఎస్ ప్రొఫెషనల్స్ (సిఈపి) వ్యవస్థాపకులు, అధ్యక్షులు తపస్ సాహ మాట్లాడుతూ.,
నాడు చిన్న వాట్సాప్ గ్రూప్ గా ప్రారంభమైన ఈ సంస్థ నేడు వేల మందితో నడుస్తుందని నిత్యం పరిశ్రమలలో ఎదుర్కొనే సమస్యల పట్ల శిక్షణ తరగతులు నిర్వహిస్తూ పారిశ్రామిక రంగాలలో చేసే ప్రతి ఉద్యోగులకు శిక్షణ లభించే విధంగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. యాజమాన్యం భద్రత ప్రమాణాల విషయాలలో పూర్తిగా సహకరిస్తున్నాయని ఆయన అన్నారు. చిన్న చిన్న ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ చేసే ప్రతి శిక్షణా కార్యక్రమం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోభిందో, ఆపిటోరియా ఫార్మా ఈహెచ్ఎస్ జనరల్ మేనేజర్ అమర్ కూడాలే, బిఎస్& బి సేఫ్టీ సిస్టమ్స్ చెన్నై రాష్ట్ర అధ్యక్షుడు బి జయ, శంకర్, గ్రాన్యూవల్స్ ఇండియా లిమిటెడ్ ఈ హెచ్ ఎస్ వైస్ ప్రెసిడెంట్ మెట్లపల్లి శ్రీనివాస్,3ఎం జనరల్ మేనేజర్ ఏ సందీప్ కుమార్, వియాష్ లైఫ్ సెన్స్ ఈ హెచ్ ఎస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాంసన్, కౌన్సిల్ ఆఫ్ ఈ హెచ్ ఎస్ ప్రొఫెషనల్స్ (సిఈపి) సభ్యులు ఏ సూర్య ప్రకాష్, ఈ తిరుపతి,పి రామకృష్ణ, చంద్రకాంత్, జి జగదీష్, ఏ మురళీకృష్ణ, హరిబుకీయ, తోపాటు సుమారు 72 పరిశ్రమల ప్రతినిధులు ఈ ఒకరోజు శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. ఇలాంటి శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల పరిశ్రమలలో క్రింది స్థాయి వారికి తెలియజేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని శిక్షణలో పాల్గొన్న ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.
Publisher
Namsthe Bharat