హై లెవెల్ బ్రిడ్జి నిర్మించండి
సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ డిమాండ్
ఉట్కూర్ మండలం : ప్రతి వర్షాకాలంలో మూడు గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడంలేదని సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మండల పరిధిలోని పులిమామిడి, బిజ్వార్, అవసలోనిపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ గ్రామాల మధ్య గల రహదారిపై హై లెవెల్ బ్రిడ్జిలకు మోక్షం ఎప్పుడు, కలుగుతుందోనని సామాజిక కార్యకర్త బిజ్వార్ మహేష్ గౌడ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు భారీ వర్షాలకు పులిమామిడి చెరువు కట్ట మలుపు దగ్గర అదేవిధంగా బిజ్వార్,అవుసలోనిపల్లి గ్రామాల మధ్య వాగుపై నీరు ఉదృతంగా ప్రవహిస్తూ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం, కలిగిస్తుందని తెలిపారు. ఎప్పుడో నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జిలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ప్రస్తుతం ఆ బ్రిడ్జిలపై నీరు ప్రవహిస్తుండడంతో రహదారి గుంతలమయం, కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు, ఎదుర్కొంటున్నారన్నారు.ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు మొదలు ఆటోలు, కార్లు, ట్రాక్టర్లలతో పాటు వివిధ రకాల భారీ వాహనాలపై ఈ మూడు గ్రామాలతో పాటు మగ్ధంపూర్, ఊట్కూర్, పెద్ద జట్రం, పాత పల్లి, ధన్వాడ గ్రామాలకు ప్రజలు ప్రయాణిస్తుంటారని, ప్రయాణికులకు మాత్రం ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఆర్ అండ్ బి అధికారులు వీటిపై హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించి ప్రయాణికుల ఇక్కట్లు తొలగించాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
Publisher
Namasthe Bharat