గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా

ఫ్యామిలీ ఫంక్షనులో హాజరైన రెండోవ గ్రేడ్ కమీషనర్

On
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా

ఇటీవల విడుదలైన గ్రూప్-1 పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 700 మంది విద్యార్థులు మాత్రమే ఉతిర్ణం పొంది వివిధ శాఖల్లో గ్రాడ్ 1, గ్రాడ్ 2 ఉద్యోగులుగా నియమితులయ్యారన్న విషయం తెల్సిందే. అయితే కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామరం గ్రామంలోని చితరమ్మ దేవాలయంలో శుక్రవారం నాడు జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలో గ్రూప్ వన్ అభ్యర్థి రెండోవ గ్రేడ్ కమీషనర్ పూజారి శ్రావణి యాదవ్ కురుమ సందడి చేశారు.

IMG20251017221437

పుట్టిన రోజు వేడుక వారి బంధువులదని సమాచారం. శ్రావణి కురుమ గ్రూప్స్ అభ్యర్థి అయిన ఆమె ఎప్పటి లాగే వారి తల్లిదండ్రులతో సింపుల్ గా కనిపించారు. వారి బంధువులు ఆవిడను అలాగే వారి తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అవసరం లేని ఆర్భాటాలు.. అక్కరకు రాని ఆవేశాలు.. ఎప్పటికీ పనికిరానివే..! ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి..! అనే సామెతలు గుర్తుకుతెచ్చుకున్నరు శ్రావణి వ్యవహార శైలి చూసిన వాళ్ళు. పలకరింపులో కూడా గౌరవం కనిపించడంతో ఆవిడను చూసి మురిసిపోయారు. 

IMG20251017221625

పేద కుటుంభం నుండి గ్రూప్ వన్.!

కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ చెందిన ప్రభాకర్ రెడ్డి నగర్లోని పూజారి లింగయ్య యాదవ్ కురుమ ఒక స్క్రాప్ వ్యాపారి. ఎన్నో ఏండ్ల నుండి ఒడిదుడుకులు అనుభవిస్తూ విధ్య యొక్క విలువలు తెలిసినవాడు. ప్రస్తుత సమాజంలో చదువు ఉంటేనే విలువ అని గ్రహించిన లింగయ్య తన పుత్రిక పూజరి శ్రావణిని ఉన్నత చదువుతో పాటు గ్రూప్స్, సివిల్స్ కి కావాల్సిన రుసుము సమకూర్చి విద్యావంతురాలను చెయ్యడంతో పాటు శ్రావణి కృషి కూడా తొడుపడింది. గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్ 2 కమిషనరుగా తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు.

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

ప్రభుత్వ టార్గెట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమా.? ప్రభుత్వ టార్గెట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గమా.?
రాష్ట్రంలో అంత్యంత అవినీతితో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, మేధావుల ఒత్తిడి ఉన్న ప్రాంతం ఏదైన ఉందంటే అది మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ...
JEEDIMETLA | పోలీసుల బ్లడ్ డోనేషన్ - ఓ చిన్నారి ప్రాణం సేఫ్
బీసీలపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి
Etela Rajendar | బీసీలకు మద్దతుగా జూబ్లీబస్సు స్టేషన్ వద్ద నిరసన
గ్రూప్ 1 అభ్యర్థి సింప్లిసిటీకి ఫిదా
PATHOLES | గుంతల రోడ్లు తప్పని తిప్పలు
Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు

Advertise