Breaking : ఏసిబి వలలో అటవీ శాఖ అధికారులు
On
నలభై వేలు లంచం తీసుకుంటూ అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్, డ్రైవరును రెడ్ హ్యాండెడ్ ACB అధికారులు పట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ డివిజన్, పరిగి రేంజ్ అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో ఒక కాంట్రాక్టు విషయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మొయినొద్దీన్ కాంట్రాక్టర్ వద్ద నుండి 40,000 డిమాండ్ చేసారు. దింతో బాధితుడు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. కెమికల్ పోసినా డబ్బులను ఫారెస్ట్ ఆఫీసర్ డ్రైవర్ సాయి కుమార్ సహాయంతో తీస్కుంటుండంగా ACB అధికారులు పట్టుకునున్నారు. కెమికల్ టెస్ట్ చెయ్యగా పాజిటివ్ అని వచ్చింది. సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పై కేసు నమోదు చేసి, ACB అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
About The Author
Tags
Latest News
19 Oct 2025 19:15:27
రాష్ట్రంలో అంత్యంత అవినీతితో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, మేధావుల ఒత్తిడి ఉన్న ప్రాంతం ఏదైన ఉందంటే అది మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ...