ఆక్రమణలను తొలగించిన హైడ్రా

రాజేంద్రనగర్లో 19878 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా, భూమి ధర 139 కోట్లుంటుందని అంచనా

On

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా బుధవారం తొలగించింది.  బద్వేల్ - ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2, లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

IMG-20251016-WA0013

దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ I, II పేరుతో హుడా అప్రూవల్ తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్ లో  పార్కులు కబ్జాకు గురి అవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.

రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం  కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకొని వేసిన షెడ్డులను , రూమ్ లను హైడ్రా తొలగించింది. 3 వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేసింది. ఆక్రమణల తొలగింపు తర్వాత వెను వెంటనే ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టింది.

Publisher

Namasthe Bharat

About The Author

Share On Social Media

Latest News

ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ ఫామ్ హౌసులో మూజ్ర పార్టీ
మంచాల మండలం లింగంపల్లిలోని  సప్తగిరి ఫామ్‌ హౌస్‌లో బుధవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్‌ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుతుందని సమాచారంతో...
చనిపోయిన మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని
ఆక్రమణలను తొలగించిన హైడ్రా
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాహా వేడుక
మంచినీరు ఓవర్ ఫ్లో - ఇండ్లలోకి చేరుతున్న ప్రవాహం
పరిశుభ్రత పాటించని హోటల్ పై కొరడా
దగ్గు సిరప్‌ ఆరోగ్యానికి హానికరం

Advertise