Category
రంగారెడ్డి
రంగారెడ్డి 

బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy

బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy కాంగ్రెస్ బాకీ కార్డు పట్ల ప్రజలకు క్లుప్తంగా వివరించాలి రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మరల కోరుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు గట్టిగా కష్టపడాలి స్థానిక ఎన్నికల్లో భారీగా గులాబీ జెండా ఎగరడం ఖాయం చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్
Read More...
రంగారెడ్డి 

CHEVELLA : ఎమ్మెల్యే కాలే యాదయ్య రండి కుర్చీలో కూర్చోండి 

CHEVELLA : ఎమ్మెల్యే కాలే యాదయ్య రండి కుర్చీలో కూర్చోండి  పదేండ్ల నుండి కూడా పెట్టిన ఆస్తులను కాపాడుకోవడానికి పార్టీ మారిండ్రు పార్టీ మారలేను అని చెప్పిన కాలే యాదయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రతి సమావేశాలకు రండి  మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మోస పోయిండ్రు ఇలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయని హెచ్చరించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
Read More...
రంగారెడ్డి 

SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు

SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు అప్రమత్తమైన పోలీసులు -  అదుపులోకి తీసుకొన్న వైనం  పోలీసులకు ప్రశాంత్ కు మధ్య వాగ్వివాదం  వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన  వాగులో పడి మరణించిన దస్తగిరి లింగం ది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు  50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎమ్మెల్యే రావాలి అంటూ ఆందోళన
Read More...
రంగారెడ్డి 

దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్

 దక్షిణ భారత కరాటే ఛాంపియన్‌షిప్ శంకరపల్లి మణి గార్డెన్స్ వేదికగా క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణకు అద్భుత ప్రదర్శన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన వందలాది యువ క్రీడాకారులు  ప్రధాన అతిథులు గా  ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ,కె.ఎస్. రత్నం, డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి  విజేతలకు పతకాలు, అభినందన పత్రాలు అందజేసిన అతిథులు
Read More...
రంగారెడ్డి 

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి బీజేపీ పార్టీ నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు రక్తదానం మోదీ కోసం రక్తమే కాదు ప్రాణాలు ఇవ్వడానికైన సిద్ధమే"ఎంకనోళ్ల వెంకటేష్" బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్ నగర్ సెప్టెంబర్17: భారతప్రదాని పూజ్యులు నరేంద్రమోది 75 వ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం షాద్ నగర్ పట్టణంలోనీ ఏబీ కాంప్లెక్స్ లో షాద్ నగర్ టౌన్ మరియు ఫరూక్ నగర్ మండలం సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం లో బీజేపీ నేతలు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషకరమని. అందులో ఉడతా భక్తిగా తను కూడా రక్త దానం చేయడం తన పూర్వజన్మ సుకృతం అని బీజేపీ నాయకులు ఎంకనోళ్ల వెంకటేష్ పేర్కొన్నారు. ఎంకనోళ్ల వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ., భారత ప్రధాని నరేంద్ర మోదీ  75 వ పుట్టినరోజు సందర్భంగా సేవ భావానికి దాతృతానికి  ఈ దేశం పై ఉన్న ప్రేమ అకుంఠత దీక్షకు ప్రతిఫలంగా రక్తదానం చేయడం చాలా చిన్న విషయం అని ఎన్నో సందర్భాలలో రక్త దానం చేయడం జరిగిందని కానీ ఈ రోజు నరేంద్ర మోదీ పుట్టిన సందర్భంగా రక్తదానం చేయడం చాలా ప్రత్యేకమైంది అని ఆయనకోసం రక్తమే కాదు ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని ఆయనకు సేవ చేసుకొనే భాగ్యం ఈ విదంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు నరేంద్ర మోదీ మరో శివాజీ, మరో సుభాష్ చంద్రబోస్,ఆయన ఈ దేశంలో పుట్టడం భారతావని చేసుకున్న అదృష్టం ఇలాంటి మనిషి మల్ల పుట్టాడు అని ఆయన ఉండగా ఈ దేశాని కి ఎలాంటి ముప్పు వుండదని,ప్రత్యర్థుల గుండెల్లో వణుకుపుట్టించే కర్మయోగి ఈ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన యోధుడు  నరేంద్ర మోదీ అని పేర్కొన్నారు. ఆ మహనీయుని కోసం ఎంతచెప్పినా తక్కువే ఆడంబరాలకు పోకుండా తన కన్న తల్లి అంత్యక్రియలు అనుకున్న సమయంలో పూర్తిచేసి వెంటనే అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మకుటం లేని మనిషి నరేంద్ర మోదీ, ప్రధానిగా ఒక్క రోజు సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తున్న మహోన్నత మైన వ్యక్తి  మోదీ, దేశ హితమే తన ద్యేయంగా దేశ ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తున్న ప్రధాని ఆయురారోగ్యాలతో ఈ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనీ వారికి మరొక్క సారి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షేరీ విష్ణువర్ధన్ రెడ్డి,పిట్టల సురేష్,భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
రంగారెడ్డి 

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం

అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ అవగాహన కార్యక్రమం మంగళవారం, అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీ సుభాష్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య జి. కిషోర్ కుమార్ (సెంటర్ ఫర్ ఎర్త్, ఎట్ మాస్ ఫియర్ సైన్సెస్ మరియు ఓషియన్, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ) విచ్చేసి విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి భూమిని కాపాడేది ఓజోన్ పొర. భూమిపై సకల జీవరాసులకు ప్రాణలను కాపాడుతున్నది కూడా ఓజోన్ పొరే. ఓజోన్ పొర అంటార్కిటికా ప్రాంతంలో దెబ్బతినడాన్ని 1975 సంవత్సరములోనే శాస్త్రజ్ఞులు గుర్తించారు. అది నానాటికి పలుచనవుతూ 1987 నాటికి తీవ్రంగా దెబ్బతినింది. అభివృద్ధి పేరుతో మనుషులు చేసే చర్యల వలన ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు, రసాయనాలు, పకృతి వనరులు దుర్వినియోగం కూడా ఓజోన్ దెబ్బతినడానికి కారణాలు. ఓజోనును రక్షించుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సెప్టెంబరు 16 నాడు ప్రపంచ వ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం భూమిపై ఉన్న సకల జీవరాసులకు కవచంగా ఉన్న ఓజోను పొరకు ఏర్పడిన నష్టాల గురించి ప్రజలకు వివరించి నష్ట నివారణ చర్యలు చేపట్టడమే" అని అన్నారు." ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న వివిధ రకాల ఉత్పత్తులను వాడకుండా చేసేందుకు, చూసేందుకు, ఆచరించేందుకు ప్రపంచ దేశాల మధ్య మాంట్రియల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం సెప్టెంబరు 16న 1987 సంవత్సరములో కుదిరింది. ఐక్యరాజ్యసమితి వారు 1994లో రెజెల్యూషన్ పాస్ చేసి 1995 సెప్టెంబరు 16వ తేదీ నుండి ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం _ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్_. ఓజోన్ పొర భూమియొక్క స్ట్రాటో ఆవరణలో ఉంటుంది. ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత (Ultra Violet) కిరణాలను గ్రహిస్తుంది. ఓజోన్ ప్రధానంగా వాతావరణంలో రెండు  పొరలుగా ఉంటుంది. 1. భూమికి దగ్గరగా సుమారు రెండు అడుగుల ఎత్తులో ట్రోఫోస్ఫెరిక్ ఓజోన్. ఇది కాలుష్య కారకమైనది. పంటలపై దీని చెడు ప్రభావం ఉండి దిగుబడి తగ్దిపోతూ ఉంటుంది. అలాగే శ్వాసకోశ వ్యాధులకు కారణభూతమౌతుంది. 2. స్ట్రాటోస్ ఫెరిక్ ఓజోన్. ఇది భూమికి 30 నుండి 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండి సుమారు 25 నుండి 40 కిలోమీటర్ల మందంతో పాలపై మీగడలా భూమి ఉపరితలం చుట్టు ఉంటుంది. దీని ఫలితంగా అతినీలలోహిత కిరణాలు భూమిపై నేరుగా పడకుండ ఉంటాయి. ఆ పొరే కనుక లేకపోతే సకల జీవరాసులు నాశనమయ్యేవి. అంతేకాకుండా మానవులు చర్మవ్యాధులు, కంటి జబ్బులు, మానసిక వైకల్యం మరియు క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల బారిన పడటంతో పాటు సంతానోత్పత్తి కూడా తగ్గిపోయి ఉండేది. కనుక ఓజోన్ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తు తరాలకు మనము ద్రోహము చేసిన వారమవుతాము. ఓజోన్ పరిరక్షణకు క్లోరో, ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. భూతాపాన్ని తగ్గించేందుకు వీలయ్యే అన్ని చర్యలు చేపట్టాలి. మొక్కలు, చెట్లను పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. పర్యావరణాన్ని రక్షించే చర్యలు చేపట్టాలి. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్తు వాడకాన్ని పెంచాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులను పరిమితంగా వాడుకోవాలి. సాధ్యమైనంత మేరకు వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి. వీలైనంతవరకు సేంద్రియ ఉత్పత్తులనే వాడాలి. మనం నిత్యం వాడే వస్తువులలో పర్యావరణ హిత వస్తువులనే కొనుగోలు చేయాలి. A. C ల వాడకాన్ని తగ్గించాలి. అలాగే H.C.F.C.S, C. F. C. S కు బదులు హైడ్రో కార్బనుతో తయురైనవే వాడాలి. సేంద్రియ ఎరువులనే ఉపయోగించాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించి జనపనార లేదా పత్తితో తయారుచేసే సంచులను వాడాలి. RRR (Reduce, Recycle, Re use)ను అమలుచేయాలి. ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టి ఓజోనును రక్షించినచో అది మనలను రక్షిస్తుంది. ఇది మన అందరి సామాజిక బాధ్యత. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం చిత్తశుద్ధితో  కృషి చేసినప్పుడే ఈవిధమైన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి" అని అన్నారు. ఈ సందర్భంగా పిల్లలందరిచేతా ఓజోన్ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీమతి పద్మజ, శ్రీ వీరేశం, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, అమ్మయ్య చౌదరి, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Read More...
రంగారెడ్డి 

హనీ ట్రాప్ తో వల... మనీ డిమాండ్ తో బుక్

హనీ ట్రాప్ తో వల... మనీ డిమాండ్ తో బుక్ అనారోగ్య సమస్యతో యోగ ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు కొద్ది రోజుల్లోనే యోగా గురువు తో మహిళలు క్లోజ్ మూవ్  క్లోజ్ గా ఉన్న ఫోటోలు వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ మరో రెండు కోట్ల రూపాయలు లేదా రెండు ఎకరాల భూమి కావాలని గట్టి డిమాండ్ గోల్కొండ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,(యోగ గురువు ) మిట్ట వెంకట రంగారెడ్డి పక్క ప్రణాళికతో ఆ ముఠాను పట్టుకున్న గోల్కొండ పోలీసులు ఆదివారం చేవెళ్లలో ఇది ఒక హార్ట్ టాపిక్  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ కేంద్రం లోని దామరగిద్ద వార్డ్ లో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి ఫామ్ హౌస్ ఉంది.ఇదే ఫామ్ హౌస్ లో వెల్నెస్ సెంటర్,యోగ ఆశ్రమం వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుంటాయి.ఈ ఫామ్ హౌస్ యజమాని చేవెళ్ల బిజెపి పార్టీ నాయకులు మిట్ట వెంకట రంగారెడ్డి పై హనీ ట్రాప్ వల విసిరింది హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అమర్ అతని గ్యాంగ్. గత నెలలో ఇద్దరు మహిళలలకు ( రజిని, మంజుల ) ఆరోగ్యం బాగాలేదని తీసుకొని యోగ ఆశ్రమానికి వచ్చాడు ఈ హనీ ట్రాప్ బాస్ అమర్.అతి తక్కువ రోజుల్లోనే ఆశ్రమంలో ఉండడానికి వీరికి అవకాశం దొరికింది.పక్కా ప్రణాళికతో ఉన్న ఈ మహిళలు యోగ గురువు మిట్ట వెంకట రంగారెడ్డి తో సన్నిహితంగా ఉంటూ వివిధ రకాల ఫోటోలు వీడియోలను తీసి భద్రపరుచుకున్నారు.ఆరోగ్యం బాగాలేదు యోగతో ఆరోగ్యంగా ఉంటారని పంపిస్తే మీరు చేస్తున్న పనులేంటి ప్రతి ఫోటో వీడియో మా దగ్గర ఉన్నాయి మేము అడిగినంత ఇచ్చుకోకపోతే ఫోన్ లో ఉన్న ఈ ఫోటోలు వీడియోలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామంటూ బెదిరించారు.దిక్కుతోచని పరిస్థితిలో యోగా గురువు మిట్ట వెంకట రంగారెడ్డి పరుగు పరుగున అమర్ గ్యాంగ్ దగ్గరికి చేరాడు.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అమర్ గ్యాంగ్. చేసేదేమీ లేక రూ.. 25 లక్షల రెండు చెక్కులను ఇచ్చాడు.మరో కొంత వ్యవధి లోనే ఈ అమౌంట్ సరిపోదు మరో రెండు కోట్ల రూపాయలు ఇవ్వు,లేదా రెండు ఎకరాల భూమి ఇవ్వాలని,గోల్కొండ లో ఉన్న తారామతి భానుమతి రెస్టారెంట్ కు వచ్చి డబ్బులు ఇవ్వాలని గట్టి డిమాండ్ చేశారు అమర్ గ్యాంగ్.ఈ గ్యాంగ్ నుంచి ఏలాంటి బెడద లేకుండా ఉండాలంటే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని గోల్కొండ పోలీసులను ఆశ్రయించాడు.తారామతి భానుమతి రెస్టారెంట్ కు వెళ్లి అమర్ గ్యాంగ్ తో మాటలు కలుపుతున్న సమయంలో పక్క ప్రణాళికతో ఉన్న పోలీసులు అమర్ గ్యాంగ్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.గోల్కొండ పోలీసులు హనీ ట్రాప్ కు పాల్పడ్డ రజిని మంజుల అమర్ మౌలాలి రాజేష్ లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది.ఈ గ్యాంగ్ ఇలాంటి హనీ ట్రాప్ లు ఇంకా ఏవైనా క్రైమ్ కు పాల్పడ్డారా అనేదానిపై ముమ్మార దర్యాప్తు ప్రారంభించారు గోల్కొండ పోలీసులు. చేవెళ్లలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది.
Read More...
రంగారెడ్డి 

జైపాల్ రెడ్డికి 15 వేలు ఆర్థిక సాయం

జైపాల్ రెడ్డికి 15 వేలు ఆర్థిక సాయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్24:జడ్చర్లకు చెందిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తి కాంకెన్ వాటర్ ప్యూరిఫైయర్ లో పనిచేస్తూ, మిషిన్లు తీసుకొని ట్రైన్ ఎక్కుతుండగా కాలి జారి సందులో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి.ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ...
Read More...
రంగారెడ్డి 

నూతన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవం లో మరియు నూతన గృహప్రవేశంలోపాల్గొన్న

నూతన ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవం లో మరియు నూతన గృహప్రవేశంలోపాల్గొన్న    బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి    నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 20:బుధవారం మొగిలిగిద్ద  గ్రామంలో ఎన్ శివకుమార్  నూతనంగా ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభోత్సవకార్యక్రమం నిర్వహించడం.ఈ యొక్క కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కావడంజరిగింది.నూతనంగా ఎలక్ట్రికల్ షాప్ ప్రారంభిస్తున్న నవీన్ కుమార్ ను
Read More...
రంగారెడ్డి 

ఆగమరిస్తే అంతే సంగతి 

ఆగమరిస్తే అంతే సంగతి     సోలిపూర్ 5వ వార్డులోని బైపాస్ సర్వీస్ రోడ్డు పరిస్థితి  ఐ సాడక్ రాయికల్,షాద్ నగర్ మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని  సోలిపూర్ గ్రామ నివాసి సామాజిక ఉద్యమకారుడు సింగపాగ జంగయ్య కోరారు  నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్20:షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ ఐదవ వార్డులో పైభాగమేమో డంపింగ్ యార్డ్ క్రింది భాగము డ్రైనేజ్ వాటర్...
Read More...
రంగారెడ్డి 

మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీం ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. 

మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీం ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.     పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు   నమస్తే భారత్ ఆగస్టు 20 తలకొండ పల్లి  రంగారెడ్డి జిల్లా తలకొండ పల్లి  మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజీమ్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ...
Read More...
రంగారెడ్డి 

వర్షానికి సైతం లెక్కచేయకుండా రెండోవ వార్డు సమస్యలను తెలుసుకున్న 

వర్షానికి సైతం లెక్కచేయకుండా రెండోవ వార్డు సమస్యలను తెలుసుకున్న     షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 19:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ రెండో వార్డులో వర్షానికి సైతం లెక్కచేయకుండా స్థానిక నాయకులతో కలిసి రెండవ వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ స్థానిక ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ప్రజల...
Read More...