BATHUKAMMA : బతుకమ్మ ఏర్పాట్లు ఎక్కడ
వర్ణతీతంగా మారిన అంబిర్ చెరువు
కూకట్ పల్లి మండలంలోని అంబిర్ చేరువు వద్ద బతుకమ్మ నిమజ్జనలకు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యకపోపోవడం పై స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్టు మీడియాలో అధికారులు తెలుపుతున్న రియాలిటీలో మరోలా ఉంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం, కూకట్ పల్లి సిర్కిల్ 24, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ శివారులో ఉన్న అంబిర్ చెరువు పై ప్రతి సంత్సరం భారీగా బతుకమ్మ కార్యక్రమంతో పాటు చెరువులో పేర్చిన బతుకమ్మలను నిమ్మజ్జనం చెయ్యటానికి మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొంటారు.
కానీ ప్రస్తుతం అంబిర్ చెరువు వద్ద పరిస్థితి వర్ణతీతంగా ఉంది. సద్దుల బతుకమ్మకు ఇంకా నాలుగు రోజులే ఉన్న ఎలాంటి ఏర్పాట్లు కనపడడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. చేరువుపై చెత్త, తాగిపడేసిన మందు సీసాలు, మెట్లపై గాజుముక్కలు, పాత సోఫాలు, చెరువులో దుప్పట్లు దర్శనం ఇస్తున్నాయి. సరైన విద్యుత్ దీపాలు లేని కారణంతో చిమ్మచీకటిగా మారింది ఆప్రాంతం.
ప్రతి సంత్సరం లక్షల్లో బడ్జెట్ జారిచేస్తున్న అధికారులు సరైన ఏర్పాట్లు చెయ్యకపోవడాన్ని చూసి స్థానికులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కలిపించాలని డిమాండ్ చేస్తున్నారు. చేరువుపై ఉన్న చెత్త, తాగిపడేసిన సీసాలు, మెట్ల పై గాజుపెంకలు, చెరువులో ఉన్న డెక్క చెత్తను వెంటనే తీసివేయ్యాలని కోరుతున్నారు స్థానికులు. హై వోల్టేజి విద్యుత్ దీపాలు సైతం బిగించాలని సూచించారు.
Publisher
About The Author
Advertise

