HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
భాగ్యనగర్ కాలనీ గోవింద్ హోటల్ వద్ద రోడ్డుపై పారుతున్న డ్రైనేజి
డ్రైనేజి సమస్యతో ప్రజలు అవస్థకు గురి అవుతున్నారు. విపరీతంగా పారుతున్న మురురు కంపుతో వాహదారులు ఇబ్బందులు పడ్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో ఉన్న మాదవి సొసైటీ, గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద గత నాలుగు రోజులుగా డ్రైనేజి మురుగు పొంగిపొర్లుతోంది.
ఈ సమస్యతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుండి తులసివనం రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ పోలీసులు ఎవ్వరు అక్కడ డ్యూటీలో లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గతంలోనూ డ్రైనేజి డ్యామేజీ అవ్వడంతో జలమండలి అధికారులు రాత్రిపగలు శ్రమించి మరమత్తు చేసారు. కానీ ఆమరమత్తు తాత్కాలికంగా, నాసారికంగా కాంట్రాక్టర్ చేసారని, అందుకే మల్లి సమస్య మొదటికి వచ్చిందని ఇబ్బందులు పడుతున్న వారుఆరోపిస్తున్నారు.
ఇంత దారుణంగా సమస్య ఉన్న ఎవ్వరు పట్టించుకోవడం లేరని మండిపడుతున్నారు. జెఎన్టియు నుండి గాజులరామారాం వరకు రోజు వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయని, ఈరోడ్డులోకి వస్తే చాలు నరక యాతన పడుతున్నామని వాహన చోదకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికనా మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేసారు స్థానికులు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

