బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటి ఆడపడుచుకు చీర అందింది
- కాంగ్రెస్ బాకీ కార్డు పట్ల ప్రజలకు క్లుప్తంగా వివరించాలి
- రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మరల కోరుకుంటున్నారు
- ప్రతి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు గట్టిగా కష్టపడాలి
- స్థానిక ఎన్నికల్లో భారీగా గులాబీ జెండా ఎగరడం ఖాయం
- చేవెళ్ల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం
- బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద మొత్తంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేల ప్రతి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు గట్టిగా పని చేయాలని చేవెళ్ల చెల్లమ్మగా పేరుగాంచిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబిత ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో బుధవారం సీసీఎంఎస్ చైర్మన్ పట్లోల్ల కృష్ణారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనతోనే రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేలా పాలన కొనసాగుతుందని, ఏ పార్టీతో రాష్ట్రం సుభిక్షంగా కొనసాగిందో అనే విషయం రాష్ట్ర ప్రజలకు గ్రహిస్తూనే ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనే మాట ఏమిటంటే అబద్ధపు మాటలు విని కెసిఆర్ ను దూరం చేసుకున్నామని ప్రజలు ఎంతగానో దిగులు చెందుతున్నారని అన్నారు. అసమర్ధత పాలనలో దసరా పండుగకు అందని బతుకమ్మ చీరలని, అదే మా కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటి ఆడపడుచుకు చీర అందిందని, సంవత్సరానికి ఒకసారి వచ్చే దసరా పండుగకు ఆడపడుచులకు చీరను అందించని రేవంత్ ప్రభుత్వం ఆడపిల్లలకు ముఖం చూపించని విధంగా తయారైందని మండిపడ్డారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులు,ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే "కాంగ్రెస్ బాకీ కార్డు" తో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల పట్ల క్లుప్తంగా వివరించాలని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుండి మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గులాబీ జెండాను ఎగరవేయాలని రాష్ట్ర ప్రజలకు పూర్వ వైభవం దక్కేల కష్టపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ దేశమల్ల ఆంజనేయులు, కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు వంగ శ్రీధర్ రెడ్డి, ముడిమ్యాల మాజీ సర్పంచ్ శేరి స్వర్ణలత దర్శన్, బిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శశి పాల్, దశరథ్, చేవెళ్ల మాజీ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మండల యూత్ అధ్యక్షులు శేఖర్, హరితసేన ఇంచార్జ్ పృధ్వీరాజ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కమ్మెట హనుమంత్ రెడ్డి, విగ్నేష్ గౌడ్, అబ్దుల్ ఘని, బ్యాగరీ సుదర్శన్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

