MUSI RIVER : మూసి ఉగ్రరూపం
హైద్రాబాదులో వరద బీభత్సం, ఇండ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులు
హైదరాబాద్ నగరాన్ని మూసి నది ముంచివేసింది. అనంతగిరి అడవుల్లో పుట్టి నల్గొండ మీదుగా ఆంధ్ర రాష్ట్రానికి పారె మూసి ఉగ్రరూపం దాల్చింది. హిమయాత్ సాగర్, గండిపేట నుండి భారీగా నీరు విడుదల చేయటంతో నదికి ఇరువైపులా వెలిసిన బస్తీలు పూర్తిగా నీట మునిగింది. పిల్లజల్లాలతో వారి ఇండ్లను ఇంట్లో సామాగ్రిని వదిలి ఇతర ప్రాంతాలను వెళ్లాల్సిన పరిస్థితితో ఆందోళన చందుతున్నారు.
ఇటు జియగూడా, పూరణాపూల్, ఎంజిబిఎస్ బస్టాండ్, ముసరంభాగ్ ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో చేరువులన్ని నిండిపోయి దిగువ ప్రాంతానికి పారుతుండడంతో భారీగా హైదరాబాదుకు వరద సంభవించిందని, దీని ప్రభావం యాదాద్రి, సూర్యాపేట జిల్లాలోని కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఈసంఘటలో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నీట మునిగింది.
ఇప్పటికీ మూసి ప్రాజెక్టు యొక్క 9 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి పంపుతున్నారు. నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమీషనర్ పరిశీలించారు. వరద ప్రమాదలపై అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పూర్తిగా మునిగిన MGBS
మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నీట మునిగిపోవడంతో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు అక్కడే ఇరుక్కున్నారు దింతో రంగంలోకి దిగిన DRF తడ్ల సహాయంతో ప్రయాణికులను బయటకు తీసుకోవచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఓ ప్రకటన జారీచేసింది. ఈ ప్రకటనలో మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంబీజీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పేర్కొంది. వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాల్సిందిగా సూచించింది.
దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది.
ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే సర్వీసులు జేబీఎస్ నుంచి నడుస్తున్నాయి.
వరంగల్, హన్మకొండ వైపునకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళ్తున్నాయి.
సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ వైపునకు బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయి.
మహబూబ్నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే సర్వీసులు ఆరాంఘర్ నుంచి వెళ్తున్నాయి.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

