ఎల్లమ్మబండలో ఘనంగా సద్దుల బతుకమ్మ
సంప్రదాయ పాటలతో సందడి
సద్దుల బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా, ఆనందంగా నిర్వహించబడింది, శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మబండ తారకరామా నగర్లో. స్థానిక కాలనీ ఆడపడుచులు, మహిళలు, పిల్లలు పూలతో అలంకరించిన బతుకమ్మలను సిద్ధం చేసి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు. సాంప్రదాయ వేషధారణలో పాల్గొన్న మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో పెద్దలు, యువత, చిన్నారులు సమిష్టిగా పాల్గొని బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. పెద్దలు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాల్లో బతుకమ్మకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. తారకరామా నగర్ మహిళలు అందరూ కలిసి సామరస్యంతో పండుగను జరుపుకోవడం విశేషం. స్థానిక మహిళలు పాడిన పాటలు, డ్యాన్సులు, ఆటలు కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరగా బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి అంబిర్ చెరువులో నిమజ్జనం చేశారు.
Publisher
About The Author
Advertise

