దుర్గమ్మను దర్శించుకున్నా నల్ల జై శంకర్ గౌడ్
అన్నదానం అత్యంత పుణ్యకార్యం అని తెలిపిన జై శంకర్
On
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల డివిజన్ పరిధిలో హౌసింగ్ కాలనీ టీమ్ స్టెప్‌అప్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారు దుర్గా అవతారంలో దర్శనమిచ్చి భక్తులకు ఆశీర్వాదం ప్రసాదించారు.
ఈ సందర్భంలో ప్రధాన అతిథిగా బీజేపీ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జైశంకర్ గౌడ్ పాల్గొని, భక్తజనులను ఉద్దేశించి మాట్లాడారు., సమాజంలో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అన్నదానం అత్యంత పుణ్యకార్యమని, ఇలాంటి సత్కార్యాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షులు పులి బలరాం, అర్జున్, లక్ష్మణ్, మనిష్, తేజ, హరి, నాయుడు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. స్థానికులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వవచనాలు తీసుకున్నారు.
Publisher
About The Author
Advertise


Latest News
03 Oct 2025 13:14:56
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు
వాహనదారులు తీవ్ర ఇబ్బందులు
ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు
రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు
ప్రతిరోజూ...