SHADNAGAR : మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు బైఠాయింపు
కార్యక్రమంలో చొచ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్త ప్రశాంత్
అప్రమత్తమైన పోలీసులు - అదుపులోకి తీసుకొన్న వైనం
పోలీసులకు ప్రశాంత్ కు మధ్య వాగ్వివాదం
వాగులో పడి మృతి చెందిన దస్తగిరి లింగం శవంతో క్యాంపు కార్యాలయం సమీపంలో ఆందోళన
వాగులో పడి మరణించిన దస్తగిరి లింగం ది ప్రభుత్వ హత్య అంటూ ఆరోపణలు
50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఎమ్మెల్యే రావాలి అంటూ ఆందోళన
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని కొందుర్గు మండలం విగ్గిర్యాల గ్రామానికి చెందిన దస్తగిరి లింగం నిన్న కురిసిన అతి భారీ వర్షాలకు ప్రవహిస్తున్న వాగులోకి వెళ్లి మృత్యువు పాలయ్యాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులోకి వెళ్లిన లింగం మరణించడంతో వాగు పై వంతెన లేని కారణంగా ప్రాణం పోయిందని ఆరోపిస్తూ బిజెపి కార్యకర్త ప్రశాంత్ తదితర గ్రామస్తులు బంధువులు లింగం శవంతో శనివారం షాద్ నగర్ పట్టణం వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు శవాన్ని రోడ్డుపై నుండి తీసివేస్తున్న సమయంలో బిజెపి కార్యకర్త ప్రశాంత్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి బలవంతంగా వెళ్ళాడు. కార్యాలయంలో ఆ సమయంలో ఎమ్మెల్యే శంకర్ లేరు. అయినప్పటికీ ఆగ్రహంతో ప్రశాంత్ కార్యాలయంలోకి చోచ్చుకు వెళ్లడంతో పరిస్థితి ఉదృతంగా మారింది. ప్రశాంత్ పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్లడంతో ఆయన వెంటనే స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితర సిబ్బంది పరుగులు తీశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య వావివాదం జరగడంతో క్యాంపు కార్యాలయంలో ప్రశాంత్ అనుమతి లేకుండా దూసుకు వెళ్లడం పట్ల పోలీసులు ముందస్తు చర్యగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం అతన్ని బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు లాఠీకి పని చెప్పారు. ప్రశాంత్ ను చొక్కా పట్టుకుని బయటికి ఈడ్చుకోవచ్చారు. అనంతరం అతన్ని అతనితోపాటు ఉన్నవారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతుడు దస్తగిరి లింగం వెంకిర్యాల గ్రామానికి చెందిన వాడుగా స్థానికులు చెబుతున్నారు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో హౌస్ కీపర్ గా అతని భార్య పనిచేస్తుంది తనను తీసుకోరావడానికి తంగేడుపల్లి గేట్ దగ్గరికి వెళ్లే క్రమంలో విశ్వనాథపూర్ తంగేళ్లపల్లి మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో అతను వాగు దాటి మృత్యుపాలు అయ్యాడు. ప్రమాద భరితంగా కొనసాగుతున్న వాగును చూసి కూడా నిర్లక్ష్యంతో దస్తగిరి లింగం వాగు దాటాడని స్థానికులు చెబుతున్నారు.
Publisher
About The Author
Advertise

