మేమేమైనా లంగలమా.. దొంగలమా..?

ఎమ్మెల్యే కార్యాలయం అద్దాలు పగలగొట్టామా..? కుర్చీలు విరగ్గొట్టామా..?

On
మేమేమైనా లంగలమా.. దొంగలమా..?

  • గల్లా పట్టి ఈడ్చుకెళ్ళి కొడతారా..
  •  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య ఆగ్రహం
  •  పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి
  •  ధర్నాలు, ఆందోళనలు చేసే శంకర్ ఎమ్మెల్యే అయ్యాడనీ మరిచారా..?
  •  పోలీసులపై డిజిపికి ఫిర్యాదు చేస్తాం
  •  షాద్ నగర్ పోలీసులు అక్రమ కేసు బనాయించారు
  •  ప్రశ్నిస్తూనే ఉంటాం.. అక్రమ కేసులకు భయపడము
  •  ప్రశాంత్ కు అండగా షాద్ నగర్, కొందుర్గు, చౌదరిగుడ, కేశంపేట, కొత్తూరు బిజెపి నాయకులు

షాద్ నగర్ : మేమేమైనా లంగలమా.. దొంగలమా..? న్యాయం కోసం ఆందోళన చేపడితే గల్లా పట్టి ఈడ్చుకెళ్ళి కొడతారా..? తాము ఎమ్మెల్యే కార్యాలయ అద్దాలు పగలగొట్టలేదు.. కుర్చీలు విరగొట్టలేదు.. మీరు పోలీసులా ..? లేక కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖాకీలా అంటూ షాద్ నగర్ నియోజకవర్గ బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు.బిజెపి కార్యకర్త పి ప్రశాంత్ తోపాటు 14 మందిపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.

IMG-20251001-WA0006

ఈ సందర్భంగా బాధితుడు పి ప్రశాంత్, కొందుర్గు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ పటేల్, చౌదరి గూడ అధ్యక్షులు రాజు, కేశంపేట మండల అధ్యక్షురాలు రోల్లు రాధిక గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ నరసింహ యాదవ్, పసుపుల ప్రశాంత్ తదితరులు మీడియాతో మాట్లాడారు.. అందే బాబయ్య మాట్లాడుతూ.. ఒక ప్రతిపక్ష హోదాలో తాము ప్రభుత్వ ఉదాసీనతను ప్రశ్నించడం తమ హక్కుని బాబయ్య అన్నారు. అయితే గతంలో ఇదే బ్రిడ్జి నిర్మాణం కోసం ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆందోళనలు ధర్నాలు చేశారని ఆ తర్వాత అధికారంలోకి ఆయన స్వయంగా వచ్చినందుకు తమ పరిస్థితి అర్థం చేసుకుంటాడని తమ కార్యకర్త పసుపుల ప్రశాంత్ ఇటీవలే వాగు ఉధృతికి కొట్టుకుపోయిన దస్తగిరి లింగం కుటుంబానికి న్యాయం చేసేందుకు శవంతో ఆందోళన చేపట్టాడని గుర్తు చేశారు. నిరసన తెలిపే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. మృతుడు దస్తగిరి లింగానికి ఒక భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని అతను అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడుతుందని భావించి అతని శవంతో న్యాయం కోసం రాస్తారోకోకు దిగినట్లుగా చెప్పారు. దీనిని మానవతా దృక్పథంతో చూడాలే తప్ప పార్టీలపరంగా కాదని అన్నారు. ఎన్ని ధర్నాలు ఆందోళనలు చేస్తే శంకర్ ఎమ్మెల్యే అయ్యాడు తెలియదా అని ప్రశ్నించారు. మీరు ధర్నాలు ఆందోళనలు నిరసనలు చేస్తే తప్పు కానప్పుడు ప్రశాంత్ నిరసన వ్యక్తం చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని వాళ్లు కాంగ్రెస్ కండువాలు వేసుకోవాలని అందే బాబయ్య తదితరులు ఘాటుగా వారి తీరును హెచ్చరించారు. పట్టణ సిఐ తమ కార్యకర్త ప్రశాంత్ ను లాఠీచార్జ్ చేశారని ఇది సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

IMG-20251001-WA0007

నిరసన తెలిపితే కేసులా.. ఆందోళన చేస్తే అరెస్టులా..!

అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం ప్రతిపక్ష హోదాలో ప్రశ్నిస్తున్న బిజెపి పార్టీ నాయకులు నిరసన తెలిపితే కేసులు, ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్పడుతున్నారని కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ పటేల్, కేశంపేట అధ్యక్షురాలు రాధిక, చౌదరిగుడ అధ్యక్షుడు రాజు తదితరులు మీడియా ముందు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ కార్యాలయ అద్దాలను ఎవరు పగలగొట్టలేదని ఇంకెవరు ఫర్నిచర్ ను ధ్వంసం చేయలేదని మరి పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేశారని ప్రశ్నించారు. అన్యాయం జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడి న్యాయం కోసం ప్రశ్నించకూడదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఆనాడు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రాస్తారోకో ధర్నాలు చేయలేథా అని ప్రశ్నించారు. ఎక్కడితే గాని డొక్కాడని దస్తగిరి లింగం విషయంలో న్యాయం కోసం శవంతో ఆందోళన చేపడుతున్న ప్రశాంత్ మరో 14 మందిపై అక్రమ కేసులు షాద్ నగర్ పోలీసులు బనాయించారని అన్నారు. పోలీసులకు ఇది సముచితం కాదని అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై డీజీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామని అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ కు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. బాధితుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. వంతెన నిర్మించక పోవడంతో ఎంతోమంది ఇప్పటివరకు వాగులో పడి మరణించారని మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అన్న కారణంగా తాను ఆందోళన చేశానని, అయితే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరించి తనపై దాడి చేశారని పైగా అక్రమ కేసులు బనాయించాలని ప్రశాంత్ తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని తాను ఎలాంటి విధ్వంసాలకు పాల్పడలేదని న్యాయం కోసం అడగడానికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే తనపై దాడి చేసి అక్రమ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై ప్రశ్నిస్తూనే ఉంటామని భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బిజెపి కార్యకర్తలు మహేందర్ తిరుపతి ముర్షద్ మురళి మహేష్ పద్మ కృష్ణయ్య జంబుల నరసింహ గొల్ల రాజు మోటా శ్రీను కురుమయ్య నరసింహ తట్టేపల్లి నరసింహ పాలాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Publisher

NAMASTHE BHARAT

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise