బతుకమ్మ పండుగ ప్రకృతికే అందం

పండుగ గొప్పతనాన్ని మహిళలు ఇతరులకు చాటి చెప్పాలన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

On

IMG-20250926-WA0066

తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలు  ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ,  ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  అన్నారు. శుక్రవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా డి ఆర్ డి ఎ, మెప్మా, ఉద్యానవన, శిశు సంక్షేమ,శాఖ ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలతో బతుకమ్మ   కార్యక్రమాలు నిర్వహించారు.

IMG-20250926-WA0069

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గౌరీమాత పూజ నిర్వహించి  బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఎ, డి డబ్ల్యు ఓ అధికారుల అధ్వర్యంలో  ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమం లో పాల్గొని,  మహిళా ఉద్యోగులు స్వయంగా బతుకమ్మలను పేర్చి ఆయా శాఖల నుండి ఉద్యోగుల అందరితో కలిసి తీసుకొచ్చిన  బతుకమ్మలతో  పాటలు పాడుతూ సందడి చేసి కలెక్టరేట్ కు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.  జిల్లా కలెక్టర్ బతుకమ్మల వద్దకు వెళ్లి మహిళలతో బతుకమ్మ ఆట ఆడి బతుకమ్మ ఉత్సవానికి మరింత ఊపును తీసుకువచ్చారు.
 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతికే అందం మన బతుకమ్మ సంబరమని ఇలాంటి బతుకమ్మ పండుగను కలెక్టర్ కార్యాలయంలో ఇంత ఆనందంగా జరుపుకోవడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉద్యోగులు ఆనందంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ కు  కొత్త శోభను తీసుకువచ్చారని అన్నారు.

IMG-20250926-WA0072

అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్, అదనపు కలెక్టర్ (స్తానిక సమస్తలు) సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డి ఆర్ ఓ మంగీ లాల్, అడిషనల్ డిఆర్డిఏ నరసింహులు, శిశుసంక్షేమ అధికారి  కృష్ణవేణి, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, డి పి ఓ జయసుధ,  డ్వాక్ర గ్రూప్ మహిళలు, ఇతర శాఖల జిల్లా అధికారులు,  అన్నిశాఖల మహిళా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Publisher

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise