మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం
టిజిఎస్ఆర్టిసి బస్సులు ఆగేందుకు అనుగుణంగా లేని చోట నిర్మించారని ఆరోపణ
హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఏర్పాటు చేసిన బస్సు స్టాప్స్ కేవలం ప్రకటనలు, ప్రైవేట్ వాహనాల పార్కింగ్, ఫుట్ పాత్ పై వ్యాపారం, దుకాణాలు, అసాంఘిక కార్యకలాపాలకు మాత్రమే పరిమితైయినట్లు కనిపిస్తుంది.
కూకట్ పల్లి నియోజకవర్గం, రాందేవ్ హాస్పిటల్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగ, నేషనల్ హైవే 65కు అనుకోని సుమారు 100 మీటర్ల పొడువు, దాదాపు 10 అడుగుల వెడల్పుతో ఉన్న స్థలం ప్రభుత్వం మెట్రోకు కేటాయించింది, దింతో మెట్రో రైల్ L&T సంస్థ ప్రయాణికులకు అవసరాల అనుగుణంగా బస్సు స్టాప్ ను నిర్మించింది. కానీ అయొక్క స్టాప్ లో ఏఒక్క రోజు కూడా తెలంగాణ రోడ్డు రవాణా శాఖ బస్సులు ఆగిన దాఖలాలు లేవు. పేరుకే బస్సు స్టాప్ అని నిర్మించి ప్రైవేట్ అడ్వేర్టైజ్ కు వాడుకొని L&T సంస్థ కోట్ల రూపాయల దందా చెయ్యడానికి తప్ప, ప్రజలు, ప్రయాణికుల కోసం ఎలాంటి సౌకర్యాలు కలిపించేందుకు కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరో వైపు టిజిఆర్టిసి వాహనాలు ఆగేందుకు ఈ బస్సు స్టాప్ అనుగుణంగా లేదని, ప్రయాణికులు ఎక్కువ శాతం రోడ్ నెం 1 వైపు కొనసాగుతారని, దాంతో ప్రమాదాలు సంభవిస్తాయని నిర్మించిన స్టాప్ తప్పుడు లొకేషన్ లో నిర్మించారని నిపుణులు స్పష్టం చేసారు.
HYDERABAD METROకు ప్రయాణికుల నుండి లాభం లేకపోయినా, ప్రకటనలు, కమర్షియల్ స్పేస్ రెంట్, పార్కింగ్, మెట్రో స్టాప్ పేరులో ప్రైవేట్ సంస్థల పేరులు జోడించడంలోనే నాలుగు ఇంతలు రాబడి ఉంది.
అందుకే వారి స్వలాభాల కోసమే అనాసరమైన చోట ప్రకటనల బస్సు స్టేషన్స్ నిర్మించుకున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

