పంచ పరివర్తన్ తో గిరిజన సమాజ పునరుద్ధరణ
ఐదు నియమాల పరివర్తనతో భారతదేశం విశ్వ గుర్తింపు పొందుతుంది : డాక్టర్ మైపతి సంతోష్ కుమార్
నేటి ఆధునిక కాలంలో మారుతున్న సమీకరణలు అనుగుణంగా గిరిజన గ్రామాల్లో సామాజిక విలువలు పతనం అవుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కోసం వ్యక్తి గత బాధ్యత, కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యతలు పునర్నిర్మాణం జరగాలి లేకుంటే మన గిరిజన సమాజo సంస్కృతిక విద్వంసం జరుగుతూనే ఉంటుంది మారుతున సమీకరణలకు అనుగుణంగా మనం మన పని లో నిమగ్నమై ఉండడం తో పరాయి సంస్కృతులు మన గిరిజన క్షేత్రాల పై జనజాతుల పై చాపకింద నీరులా వ్యాపించి నా విషయం మనం గ్రహించలేకపోతు న్నాం అందుకే మన గిరిజన సమాజo సంస్కృతిక పరిరక్షణ కుటుంబ విలువల బలోపే తం, సమాజ పునరుద్ధరణ కార్యక్రమం వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ రాష్ట్రం మే కాకుండ దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో పంచ పరివర్తన్ దీక్షకు పూనుకుంది. ఈ పంచ నియమాలతో వసుదైక విశ్వ కుటుంబానికి వేల్పుల రక్ష ఈ ఐదు నియమాల పరివర్తనతో భారతదేశం విశ్వ గుర్తింపును పొందుటకు ఆస్కారంగా ఉంటుంది.
కుటుంబ ప్రబోధన్
కుటుంబ వ్యవస్థను కాపాడు కొనుట కొరకు కుటుంబ ప్రబోధన్ నియమాలను మనం పాటించవలసి ఉంటుంది. వీటిని తమ తమ కుటుంబాలలో పాటించడం వలన కుటుంబ వ్యవస్థ చాలా బలంగా నిలబడి మనుబడును కొనసాగించడానికి అవకాశం ఉంటుంది.
కుటుంబమంతా కలిసి వారానికి ఒకసారివేల్పు గుడికి వెళ్లడం
ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో తమ జీవితాలను ఉమ్మడి కుటుంబాలు తగ్గి చిన్న కుటుంబాలుగా మార్పు చెందుతున్న క్రమంలో మానసికమైన సమస్యలకు, వివిధ రకాలబరువు బాధ్యతల ఒత్తిడిని జయించడంలో ఆధ్యాత్మికత అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కుటుంబాలు అన్ని కూడా వారంలో ఒకసారైనా గుడి సన్నిధిలో గడపడం వలన మానసిక భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తరచూ గుళ్లను సందర్శించవలసిన అవసరం ఉన్నది.
కలిసి భోజనంతో పాటు కోలు పూలు చెయ్యడం
అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేయడం వలన ఒక రకమైన అనుభూతిని కలిగిస్తాయి. జీవితాలలో ఉత్సాహం, ఉత్తేజం కలిగి మన జీవన విధానం సరళంగా సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. కలిసి కోల్పలు చేయడం వలన సాంస్కృతిక విధానం మన భవిష్యత్ తరాలకు అందించిన వాళ్లం అవుతాము, ఎంత డబ్బు వ్యక్తి ఇచ్చిన కొనలేని మానసిక ఆనందం మన సొంతం అవుతుంది.
తెగ మండ వంశాల వారినీ సందర్శించడం చేయడం
సమూహాలుగా కలిసి తీరయాత్ర చేయడం వలన మానస స్థైర్యం పొందే అవకాశం ఉంది. సహాయ సహకారాలు అందించుకునే గుణాలు కూడా ఏర్పడతాయి. మన సంస్కృతికి వారసత్వంగావస్తున్న సంపదను వీక్షించే అవకాశం మనకు కలుగుతుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని సమపార్జించిన వాళ్ళము అవుతాము.
రామాయణం, మహాభారతం, కోయతూర్, గోండు వన నీతి కథలు పిల్లలకు చెప్పడం
రామాయణ మహాభారతం, కోయ, గోండు వన రాజ్యాలలో లోని వివిధ సన్నివేశాలను వ్యక్తిత్వాన్ని పెంపొందించే అంశాలు చాలానే ఉన్నాయి. మంచి ప్రవర్తనను, కష్టాలలో ధైర్యాన్ని, మంచి సమాజం కోసం మనం చేయవలసినటువంటి పనులను ఈ ఒక్క రామాయణం, మహాభారతం , కోయ గోండు కథలు ద్వారా పిల్లలకి చాలా సులువుగా వారి జీవన విధానంలోపాటించే విధంగా చేయవచ్చును, అనేక ఆటుపోట్లను ఎట్ల తట్టుకోవాలో వీరి యొక్క జీవిత గాధలు భవిష్యత్తులో వారికి మార్గదర్శకంగా పనిచేస్తాయి.
ఇంటిలో మాతృభాష , తెగ భాష మాట్లాడడం
మన ఇంటిలో మనం మాతృభాష తెగ భాష మాట్లాడడం వలన వ్యక్తపరిచే భావాలు స్పష్టంగా ఉంటాయి. ఆలోచన విధానం కూడా రావడం వలన సృజనాత్మకతకు దారులు వేయడానికి మాతృభాష ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్త ఆవిష్కరణకు మార్గాలు మాతృభాష ఇంటిలో మాట్లాడడం ద్వారానే ఆవిష్కృతం అవుతాయని మనం గమనించవచ్చు.
పర్యావరణం మన బాధ్యత
మన అందరి జీవితాలలో అత్యంత ముఖ్యపాత్ర పోషిస్తున్నటువంటిది పర్యావరణం. మన మనుగడకు ఇదే మూలం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. నిత్యం చెట్టు, పుట్ట, అడివి,కొమ్మ ఆకు,అల్మా , జంతు, పక్షి పరిరక్షణ మన బాధ్యత.
చెట్లు పెంచడం
చెట్లకు మనుషులకు విడదీయరానీ సంబంధాన్ని కలిగి ఉన్నది. పర్యావరణ పరిరక్షణలో చెట్లు విశేషమైన పాత్రను పోషిస్తున్నాయి. అనేక విపత్కర పరిస్థితుల నుండి చెట్లు పర్యావరణాన్ని రక్షిస్తున్నాయి. వరదలు, వర్షాలు, గాలి కాలుష్యం కూడా చెట్లు మనలను రక్షిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరం మనం చెట్లను పెంచవలసిన అవసరం ఉన్నది.
విద్యుత్తును, నీరును పొదుపు
విద్యుత్తు నీరు విలువైన వనరుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ వనరులను వృధా చేయకూడదు, అవసరం మేరకే వాడుకొని, మిగిలిన వాటిని పొదుపు చేసే విధంగా చూడాలి. ఇళ్లల్లో వృధాగా అవసరం లేకుండా లైట్లును, ఫ్యాన్స్ ను వేసి ఉంచరాదు దీనివలన మన వనరు వృధాగా పోతుంది. అలాగే నీటిని కూడా మన అవసరం మేరకు వాడుకొని మిగిలిన వాటిని పొదుపు చేసే పరిస్థితిని ఏర్పాటు చేసుకోవాలి.
సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ ను నివరించడం
యావత్ విశ్వావాలికి పెనుముప్పుగా వ్యాపరించినటువంటి ఈ ప్లాస్టిక్ ను మన జీవితాలనుండి దూరంగా ఉంచవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది . దీనిని వాడటం వల్ల అనేక జంతుజాలానికి నష్టం వాటిల్లుతున్నది, మానవులలో క్యాన్సర్ కు ప్రధాన మూలంగా ఇది పనిచేస్తూ ఉన్నది . కాబట్టి మన జీవితాల నుంచి దీని దూరంగా ఉంచినట్లయితే ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం మన సమాజంలో ఉండడానికి ఆస్కారం ఉంది. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఆరోగ్యకరమైన జీవనానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మన యొక్క జీవనం మెరుగుపడి అవకాశం ముందుగా ఉంది కాబట్టి మనందరం ఎంతో బాధ్యతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం.
సామాజిక సమరసత
మన సమాజంలో అనేక రకాల సామాజిక వర్గాలకు చెందిన వారం జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి మనందరం మన యొక్క కులాన్ని గడపలోనే ఉంచుకొని సమాజంలో ఇతర వర్గాలతో మమేకమై జీవనాన్ని కొనసాగించవలసి ఉంటుంది. గడప దాటిన తర్వాత మనందరం హిందువులం అనే స్పృహతో మెలగవలసిన పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకోవాలి.
మనం వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు అప్పటికీ మనకు జీవన విధానం ఒక వృత్తి మీద ఇతర వృత్తుల వాళ్ల అవసరాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వృత్తిని మనం కొనసాగించుకుంటూ మన బంధాన్ని వివిధ వర్గాలతో పెన వేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి అందుకే మనందరం హిందువులం, అందరం బంధువులం అనే విధంగా జీవనాన్ని గడుపుదాం.
అంతేకాదు అస్పృశ్యతకు తావు లేకుండా మనందరం గొప్ప సమాజాన్ని నిర్మించవలసిన అవసరం మన పైన ఉన్నది.
స్వదేశీ
మనం మన దేశానికి సంబంధించిన స్వదేశీ వస్తువులను వాడినట్లయితే మన దేశం ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరం స్వదేశంలో తయారు అయిన వస్తువులను వాడుదాం దేశ అభివృద్ధికి పాటుపడదాం.
పెళ్లి పుట్టినరోజు వేడుకల్లో గిరిజన సాంప్రదాయం
పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలను మన సాంప్రదాయానికి తగినట్లుగా మనం పాటించవలసిన అవసరం ఉన్నది ఈ సనాతన సంప్రదాయాన్ని మన సమాజంలో అందరూ పాటించేటట్లు మన యొక్క చర్యల ద్వారా విస్తరించవలసిన అవసరం ఉన్నది. ఇది ఎన్నో ఏళ్లనాటి సాంప్రదాయం దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదనే విషయాన్ని గుర్తిద్దాం.
ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడం
భారతదేశం విభిన్నసంస్కృతలకు, భాషలకు నిలయం కాబట్టి ఇందులో మనం ప్రాంతీయ భాషలను మాట్లాడేటట్టుగా ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మన సమాజం తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఆచరించాలి కూడా.
పౌర నియమాలు
పౌరులుగా మనం అత్యంత బాధ్యతను కలిగి ఉన్నాము ఈ భారత దేశంలో. దేశం పట్ల ప్రేమ, భక్తి భావనను కలిగి ఉండాలి. అన్ని సందర్భాలలో మనం క్యూ పద్ధతిని పాటించవలసిన అవసరం ఉన్నది అక్కడ గందరగోళం ఏర్పడకుండా పనులన్నీ సాగేటట్లు ప్రతి ఒక్కరం బాధ్యతగా వ్యవహరిద్దాం. ట్రాఫిక్ నియమాలను మనందరం చాలా శ్రద్ధగా పాటించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సజావుగా ప్రయాణాలు సాగేటట్లు చూద్దాం. పరిసరాలను, దర్శనీయ స్థలాలను పరిశుభ్రంగా ఉండేటట్లు చూద్దాం పరిశుభ్రతను మనందరం మన దినచర్యలో భాగంగా ఉండేటట్లు ప్రవర్తిద్దాం. దేశ అభివృద్ధిలో, పరిశుభ్రతలో మన పాత్ర అత్యంత ముఖ్యమైనదిగా ఉంటుంది. అది దేశాన్ని ఎంతో ప్రభావాన్ని చూపెడుతుంది.
డాక్టర్ మైపతి సంతోష్ కుమార్
వనవసి కళ్యాణ పరిషత్
ములుగు జిల్లా
Publisher
Namasthe Bharat