గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి శ్రావణికి అభినందనలు తెలిపిన బండి రమేష్

బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి లక్ష్యం

On

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చిన రాష్ట్రంలో పది ఏండ్లు విచ్చలవిడి అధికారం అనుభవించి కేవలం తన కుటుంబం తన వర్గం కోసం నీళ్ల దోపిడీ నిధుల దోపిడీ నియామకాల దోపిడీ చేసి ఇతరులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా జీవితాలు ప్రాణాలతో ఆటలు ఆడి వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకున్న పాపిష్టి కేసీఆర్ పాలన నుండి విముక్తి ఇప్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వరాష్ట్ర కళలను సాకారం చేస్తూ తెలంగాణ చరిత్రలో తొలిసారిగా భారీగా గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.

IMG-20250928-WA0057

దానికి ప్రత్యక్ష నిదర్శనం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ డివిజన్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి నగర్లోని పూజారి లింగయ్య యాదవ్  పుత్రిక కుమారి పూజరి శ్రావణి గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గ్రేడ్ 2 కమిషనర్ గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు.

IMG-20250928-WA0058

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.. కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఆమె నివాసానికి వెళ్లి ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఆమెను ప్రత్యేకంగా సత్కరించారు.

IMG-20250928-WA0054

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయంతో పాటు విద్యా వైద్యం అలాగే ఉద్యోగ అవకాశాలు కలిపిస్తూ సామాజిక ఆర్ధిక ఆరోగ్య భద్రతకు సముచిత స్థానం కలిపిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య,  బాకీ తదితరులు పాల్గొన్నారు.

Publisher

About The Author

Advertise

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise