AWARDS : మేనం శ్యామ్ కు ఉత్తమ జర్నలిస్టు అవార్డు

తెలుగు భాష కల్చరల్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా వాయిస్ సీఈవోకు సత్కారం

On

విజయవాడలో గాంధీనగరులో కార్యక్రమం

తెలంగాణ నుండి శ్యాముతో పాటు మరో ముగ్గురికి అవార్డులు

IMG-20250927-WA0043
డాక్టర్ ధనాశి ఉషారాణి సంకల్పంతో తెలుగు భాష కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ఆయా రంగాలలో కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందించారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్లు లాయర్లు సినీ ప్రముఖులకు, సీనియర్ జర్నలిస్టులకు అవార్డులు ప్రధానం చేశారు.

IMG-20250927-WA0042

తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అవార్డులు

ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో నలుగురు జర్నలిస్టులను గుర్తించి ఉత్తమ జర్నలిస్టు అవార్డులతో పాటు మెమొంటో కూడా అందజేశారు. ప్రజల కష్ట సుఖాలను దృష్టిలో ఉంచుకొని సమాజసేవపై ప్రేమ కురిపించే నలుగురు ఉత్తమ జర్నలిస్టులు ఎంపిక చేయడం జరిగింది అందులో ప్రజా వాయిస్ సీఈవో మేనం శ్యామ్ కి ఉత్తమ జర్నలిస్టు అవార్డుతోపాటు మెమొంటే కూడా ప్రధానం చేశారు. అదేవిధంగా జర్నలిజంలో ఒక లెజెండరీ అయినా ఆనం చిన్ని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బాపట్ల కృష్ణమోహన్ తో పాటు కరీంనగర్ కు చెందిన మరో జర్నలిస్టు కూడా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మేనం శ్యామ్ మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ కు కావాల్సింది గుర్తింపు అతి ముఖ్యమైనది ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ జర్నలిస్టులను ఎంకరేజ్ చేస్తున్న డాక్టర్ ఉషారాణికు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ సంపాదకీయులు ప్రసాద్ కి ధన్యవాదాలు తెలిపారు. జర్నలిజం అనేది డబ్బులు సంపాదించుకోవడానికి చాలామంది వస్తుంటారు కానీ పేద ప్రజల వైపున ఎన్ని కేసులు అయినా కొట్లాడి ముందుకు వెళ్తున్నాము ఇంతకుముందు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో కూడా నాకు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు లభించడం ఇది రెండవ ఉత్తమ జర్నలిస్టు అవార్డు మళ్లీ అందులో విజయవాడలోనే లభించడం ఆ కనకదుర్గమ్మ సాక్షిగా కనకదుర్గమ్మ ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్లి పేద ప్రజల వైపునే మా జర్నలిజం ఉంటది ప్రజా వాయిస్ ఉంటది, ఇంత గొప్ప అవకాశం ఇస్తున్న నా తెలంగాణ ప్రజలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా డాక్టర్ ఉషారాణి ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేపట్టడం అందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి కూడా చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో పుట్టిన ఉషారాణి పంచలంచలుగా ఎదుగుకుంటూ అందరికీ ప్రోత్సాహం కల్పించుకుంటూ ఇంకా ముందు వరుసలోకి వెళ్లాలని మనస్పూర్తిగా ప్రజా వాయిస్ కోరుకుంటుంది అని తెలియజేశారు.

Publisher

Screenshot_2025-09-26-23-43-53-29_7352322957d4404136654ef4adb64504

About The Author

Advertise

Related Posts

Latest News

గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు గుంతలే గుంతలు – ప్రమాదాల భయంలో ప్రజలు
వర్షాలతో రోడ్డు పాడైపోయిన రోడ్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఓట్లు అడగడానికి రాజకీయ నాయకులు ఇళ్లు తిరుగుతున్నారు రోడ్డు సమస్య మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు  ప్రతిరోజూ...
ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
HMWS&SB : మురుగు కంపుతో ప్రజలు బేజారు
స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కూకట్పల్లిలో బాపు జయంతి
బతుకమ్మ చీరలు కాంగ్రెస్ పాలనలో అందవు : Indra Sabitha Reddy
మెట్రో బస్సు స్టాప్ - ప్రకటనలకే పరిమితం

Advertise