ఘనంగా దసరా పండగ ఉత్సవాలు
చితరమ్మ దర్శించుకున్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు
విజయదశమి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఇంట్లో దసరా పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
కూకట్ పల్లిలో శ్రీ చిత్తారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వాహన పూజ చేశారు.
సాయంత్రం రామాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి తాండ్రపాపారాయుడు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ధర్మధ్వజంను ఎగురవేసి, అనంతరం జమ్మి చెట్టు పూజలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ పట్టాభి సీతారాముల వారి దర్శనం చేసుకొని, రవాణ దహనం కార్యక్రమాన్ని వీక్షించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులను ఆత్మీయంగా అలై బలై చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ., “దసరా పండుగ అనేది చెడుపై మంచి విజయాన్ని సూచించే పండుగ. ఈ పండుగ మనకు ధర్మం, న్యాయం, నీతి విలువలను పాటించాలనే స్పూర్తిని కలిగిస్తుంది. సమాజంలో ఐకమత్యం, సోదరభావం మరింత బలపడాలని అందరికీ దసరా శుభాకాంక్షలు” అని తెలిపారు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

