స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడమే మహాత్ములకు అసలైన నివాళి
కైతాపురం జితేందర్ బీజేపీ అధ్యక్షులు హఫీజ్ పేట్ డివిజన్
బీజేపీ సేవా పక్ష కార్యక్రమంలో భాగంగా, హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో, మదీనాగూడ గ్రామ కూడలి వద్ద జాతీపిత మహాత్మా గాంధీ 156వ జయంతితో పాటు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి 121వ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా విగ్రహాలకు పూలమాల వేసి, వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించరు. అనంతరం వికలాంగులకు , జిహెచ్ఎంసి కార్మికురాలికి పండ్లు పంపిణీ చేశారు. హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కైతాపురం జితేందర్ మాట్లాడుతూ., భారత దేశం స్వాతంత్ర్యం కోసం ఎనలేని సేవ చేసిన, జాతిపిత గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వంలో భారత దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం, "జై జవాన్ జై కిసాన్" నినాదంతో దేశప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఆత్మనిర్భర్, వికసిత్ భారతానికి పునాది స్వదేశీ, మనం అందరం స్వయంకృషితో తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడమే గాంధీజీ శాస్త్రిజీలకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మాజీ కౌన్సిలర్ రమణయ్య, బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షులు ఆళ్ల వరప్రసాద్ , బీజేపీ నాయకులు సత్యనారాయణ రాజు , డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు శివ ముదిరాజ్ , ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, కార్యదర్శి రాజు యాదవ్, సుబ్బారావు, బీజేపీ నాయకులు అశోక్ , బాలరాజు, వినయ్, నరసింహ, లోకేష్ , గంగారం, సుభాష్ ఇతరులు పాల్గొన్నారు.
Publisher
Namasthe Bharat
About The Author
Advertise

